సింగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు కంబాల 11,116 రూపాయలు విరాళం
_కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామం సమీపంలో వచ్చే నెల మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే సింగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు_విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 11,116 రూపాయలు విరాళం అందించారు.._
_ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయానికి వచ్చి కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి ఆహ్వాన పత్రికను అందజేసారు._
జాతరకు సహకారం అందించాలని కోరగా స్పందించిన ఆయన 11,116 రూపాయలు విరాళం ఆన్లైన్ ద్వారా కమిటీ సభ్యులకు చెల్లించారు_
