కాకినాడ జిల్లా ఎస్పీ G. బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకుఈరోజు జగ్గంపేట సర్కిల్ పరిధి లోని మహిళా పోలీసుల సమావేశం
కాకినాడ జిల్లా జగ్గంపేట : జగ్గంపేట సర్కిల్ లో మహిళా పోలీసులతో శాంతి భద్రతల రీత్యా సమావేశం నిర్వహించిన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్
1. గ్రామాల్లో ప్రతి మహిళ మరియు బాలికలు విద్యార్థినీ లు ఖచ్చితంగా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకునే లాగా అవగాహన కల్పించాలని
2. మహిళా శిశు సంక్షేమ రక్షణ మరియు భద్రత విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి గృహ హింస, ఈవ్ టీచింగ్ మరియు బాల్య వివాహములు లాంటివి లేకుండా చూడాలని, యువతులు లవ్ ట్రాప్ లో పడకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలని అటువంటివి ఏమైనా ఉంటే వెంటనే సమాచారం అందించాలని
3. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైబర్ నేరగాళ్లు చేసే సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించి మోసపోకుండా చూడాలని
4 జగ్గంపేట సర్కిల్ పరిధిలోని గ్రామాలలో డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రాం బాగా నిర్వహించి ప్రతి ఒక్కరికి గంజాయి లాంటి మత్తు పదార్థాలు మత్తు పానీయాల జోలికి యువత వెళ్ళకుండా చూడాలని అటువంటి వాటి ఉనికి ఉంటే వెంటనే తెలియజేయాలని
5. అపరిచిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు గ్రామాల్లో వచ్చి నివసిస్తుంటే వారి వివరాలు పోలీస్ వారికి తెలియజేయాలని
7. గ్రామాల్లో ఎవరైనా అటవీ జంతువుల వేటకు విద్యుత్ వైర్లు వేయడం మరియు నాటుబాంబులు, నాటు తుపాకీ లు లాంటివి వాడే వారి సమాచారం సేకరించాలని
8. గ్రామాల్లో శాంతిభద్రత కేసులకు సంబంధించిన ఎటువంటి సభలు సమావేశాలు ,జాతరలు ఉన్న ముందస్తుగా సమాచాచారం తెలియజేయాలని
9. గ్రామంలలో మహిళా శిశు రక్షణ మరియు భద్రత గురించి విశేషంగా కృషి చేయాలని
9. సమయం దొరికినప్పుడల్లా మీ మీ గ్రామంలో ఉన్న విద్యాసంస్థలకు వెళ్లి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో గండేపల్లి యు వి శివ నాగబాబు, జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు మరియు కిర్లంపూడి ఎస్సై జి సతీష్ జగ్గంపేట సర్కిల్లో మహిళా పోలీసులు పాల్గొన్నారు అని జగ్గంపేట సర్కిల్ సిఐ వై ఆర్ కె తెలియజేశారు

