Hot Posts

6/recent/ticker-posts



 రాజపూడి సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ చేసిన జిల్లా టిడిపి అధ్యక్షులు, నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా జగ్గంపేట : జగ్గంపేట మండలం రాజపూడి సొసైటీ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు యూరియా పంపిణీ చేశారు. 

ముందుగా రాజపూడి సొసైటీ కి చేరుకున్న జ్యోతుల నవీన్ కు సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు (బుల్లెబ్బు) సొసైటీ సీఈవో పి అప్పారావు ఘన స్వాగతం పలికారు సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారం చేపట్టిన రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వారి అవసరాలను తీర్చేందుకు ముందుగానే గ్రహించి నిర్ణయాలు తీసుకుంటుందని అందులో భాగంగా ఈరోజు రాజపుడి సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ నిర్వహించామని వారికి ఎంత అవసరమో అంత యూరియా పంపిణీ చేస్తున్నామని గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో దాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేస్తున్నామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి రేఖ బుల్లి రాజు, పిల్లా చంటిబాబు, సర్పంచి బూసాల విష్ణు, దాసరి సీతారామకృష్ణ, ఘాజింగం సత్తిబాబు, సొసైటీ డైరెక్టర్లు చింతల కన్నారావు, దాపర్తి సీతారామయ్య, పీల మహేష్, గండికోట శ్రీను, నంగన నారాయణరావు, ముమ్మన దుర్గ, నంగన శ్రీను, గని శెట్టి సన్యాసిరావు, కందుల సత్యనారాయణ, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.