Hot Posts

6/recent/ticker-posts


 సీఎం సహాయనిధి పేదలకు వరం... 50 మందికి 38 లక్షల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా జగ్గంపేట : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అని, పేద కుటుంబాలు వైద్యకోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నారు. స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో  సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.

పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు మాట్లాడుతూ పేదవారికి ఆరోగ్యశ్రీ వర్తించని కొన్ని రకాల అనారోగ్యాలకు, ఆపరేషన్లకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా జగ్గంపేట నియోజకవర్గం లోని 4 మండలాలకు సంబంధించి 50 మంది ఆపన్నులకు రూ. 38,58,671 లక్షల సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కులం, మతం, పార్టీలకు రహితంగా అందరికీ ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులు రాష్ట్రంలోనే నియోజకవర్గంలో ఎక్కువగా తేవడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పోతుల మోహనరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.