Hot Posts

6/recent/ticker-posts



 ఘనంగా సావిత్రిబాయి పూలే  195 వ జయంతి 

 సావిత్రిబాయి పూలే ని మహిళ లు ఆదర్శంగా తీసుకోవాలి  సిఐ వై ఆర్ కె శ్రీనివాస్ 


 కాకినాడ జిల్లా జగ్గంపేట  : జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పరివర్తన స్థలములో వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ ఏర్పాటుచేసిన సావిత్రిబాయి పూలే  195వ జయంతి కార్యక్రమం కు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ టి వి ఎస్ రంగారావు సభా అధ్యక్షత  వహించినారు ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న  జగ్గంపేట సర్కిల్ సిఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఐసిడిఎస్ సిడిపిఒ ఎం పూర్ణిమ  ఎ పి ఈపిడిసియల్ జగ్గంపేట ఎ ఈ   ఈ  మాధురి లు  సావిత్రిబాయి పూలే   విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు 

 అనంతరం  మాట్లాడుతూ  భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మహిళలపై ఎంతో వివక్షుతున్నటువంటి రోజులలో ఎంతో సాహసం చేసి భర్త సహకారంతో విద్యను ప్రారంభించి సనాతన ధర్మ సంకెళ్లు  సేధించి భారతదేశ జనాభాలో సగ భాగం ఉన్న స్త్రీలకు విద్య  అందేందుకు కృషిచేసి  అసమానతకు గురవుతున్నటువంటి  బడుగు బలహీనవర్గాల ప్రజలను తన పిల్లలు గా భావించి  పిల్లలను కనకుండా   తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి సావిత్రిబాయి పూలే ని ఆమెను ఆదర్శంగా తీసుకుని  ఈరోజు  మహిళలందరూ ఉన్నత స్థాయిలో ఉన్నామని అన్నారు 

 వంటింటికి పరిమితమైనటువంటి మహిళలను సమాజంలో అభివృద్ధి చెందాలని విద్య వైపున మళ్లించి మహిళలందరినీ విద్య బాటలో పయనించేలా చేసినారు ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొని   దేశంలోనే మొదటి ఉపాధ్యాయులగా ఖ్యాతి పొందినారు అని అన్నారు 

జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే  తొమ్మిదో సంవత్సరంలోనే వివాహం జరిగింది వివాహం అనంతరం తన భర్త జ్యోతిరావు పూలే వద్ద విద్యను నేర్చుకొని సమాజంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు విద్య అందాలి అని స్కూలు ఏర్పాటు చేసినారు ఆ స్కూల్ లోకి వెళ్లే దారిలో ఆమెపై బురద పేడ చల్లి ఆటంకపరిచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అటువంటి ఏమి పట్టించుకోకుండా తన విధిని సక్రమంగా నిర్వహించి ఈరోజు యావత్ భారతదేశం లో ప్రతి మహిళ పురుషులతో పాటు సమానంగా నడిచేలాగా తీర్చిదిద్దినారు అని అన్నారు

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి సూరిబాబు ఆర్యన్ నాగసేన బోధి ఉపాధ్యాయులు ఉమా శ్రీదేవి, గీత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు  ఉయ్యూరి అప్పలస్వామి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పంచ కట్ల   రామకృష్ణ   సావిత్రిబాయి పూలే గారిని  ఉద్దేశించి మాట్లాడినారు  అనంతరం వందన  యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ ఏర్పాటుచేసిన సావిత్రిబాయి పూలే  లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును మహిళా ఉపాధ్యాయులకు అందజేసినారు వందమంది మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేసినారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు