కాకినాడ జిల్లా జగ్గంపేట : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని కనకదుర్గ అమ్మవారిని శనివారం సాయంత్రం జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండల సభ్యులు జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు వారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందించారు. సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఆ లోకమాత కనకదుర్గమ్మ అమ్మవారి, ఆ పరమ శివుడి అవతారం మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని మానవాళికి ఏ విధమైన రుగ్మతలు రాకుండా కాశి కాపాడాలని కోరుకున్నామన్నారు.

