Hot Posts

6/recent/ticker-posts

నూతన సంవత్సరం సందర్భంగా జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసిన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె వారి సిబ్బంది

కాకినాడ జిల్లా జగ్గంపేట: జగ్గంపేట శాసనసభ్యులు తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమ కుటుంబ సమేతంగా నూతన సంవత్సరం రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి దర్శనంలో ఉండడంతో ఇక్కడ ప్రజలకు ఎవరికీ అందుబాటులో లేకపోవడం వల్ల తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి దర్శనాల అనంతరం జగ్గంపేటకు నిన్న తిరిగి రావడం జరిగింది
నూతన సంవత్సరం సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ని మర్యాదపూర్వకంగా కలిసిన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కే శ్రీనివాస్, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథరావు, శివ నాగబాబు, సతీష్  లు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.