Hot Posts

6/recent/ticker-posts



 పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలు

కాకినాడ జిల్లా పిఠాపురం; జనసేనపార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వర్యులు, పిఠాపురం శాసన సభ్యులు  కొణిదెల పవన్ కళ్యాణ్  సారథ్యంలో కనీవిని ఎరుగని రీతిలో సంస్కృతి, సంప్రదాయాలతో పిఠాపురం లో అంగరంగ వైభవం గా సంక్రాతి వేడుకలు ఘనం గా జరగనున్నాయి, 

09.01.2026 వ తేది నుండి ది .11.01.2026 వ తేది వరకు పిఠాపురం నియోజక వర్గం లో పిఠాపురం నందు సంక్రాంతి సంబరాలు 

  ప్రజలను ఉత్తేజపరచేందుకు నిమిత్తం ప్రతిరోజు సాయంత్రం గం .05 : 00 . నుండి గం .07 : 30 ని.లు. వరకు వివిధ కార్యక్రమములు అనగా మొదటి రోజు ది .09.01.2026 వ తేదిన 1. హరిదాసు పాటలు 2. గంగిరెద్దు నాట్యం 3. జానపద గానం 4. వీర నాట్యం 5. ఉరుములు 6. తప్పెటగుళ్ళు 7. గరగలు 8. డప్పు 9. లంబాడీ నృత్యం 10. కొమ్ముకోయ 11. ధింసా 12. కూచిపూడి నృత్యం 13. భరతనాట్యం 14. జానపద గీతాలు 15 . కోలాటం , రెండవ రోజు ది .10.01.2026 వ తేదిన 1. పిల్లల సాంస్కృతిక కార్యక్రమములు 2. గాత్ర సంగీత కచేరీ 3. వాయిద్య సంగీత కచేరీ  , 

మూడవ రోజు ది .11.01.2026 వ తేదిన 1. పశువులు మరియు పంట జానపద ప్రదర్శన 2. గ్రామ జానపదబృందాలు డప్పు ప్రదర్శన 3. గ్రామ జానపదబృందాలు లంబాడీల నృత్య ప్రదర్శన 4. గ్రామ జానపద బృందాలు ఉరుములు నృత్య ప్రదర్శన 5. గ్రామ జానపద బృందాలు కొమ్ముకోయ నృత్య ప్రదర్శన 6. గ్రామ జానపద బృందాలు ధింసా నృత్య ప్రదర్శన 7. గ్రాండ్ మ్యూజికల్ నైట్ ( సినిమా పాటలు ) 8. రేలా రేలా రే జానపద సంగీతం మొదలగు కార్యక్రమములు నిర్వహించడం జరుగుతుందన్నారు.

1. ది .09.01.2026 వ తేది న 1. జబర్దస్త్ నటులు  హైపర్ ఆది 2. మాజీ భారత క్రికెట్ ఆటగాడు  అంబటి రాయుడు మరియు 3. నటులు .కె. నాయుడు ( సాగర్ ) అతిథులుగా హాజరౌతారన్నారు. 

 ది .10.01.2026 వ తేది న  గౌరవ MLC  కొణిదల నాగబాబు  మరియు జబర్దస్త్ నటులు 2 . సుడిగాలి సుధీర్ 3.  గెట్ అప్ శ్రీను 4.  ఆటొ రామ్ ప్రసాద్ 4.  సప్తగిరి 5.  రాకెట్ రాఘవ 6 .  ప్రదీప్ 7.  నెల్లూరు నాగరాజు 8.  జబర్దస్త్ పులి 9.  సిద్దాం హుస్సైన్ , మరియు 2024 ఎలెక్షన్ నిమిత్తము పిఠాపురం లో ప్రచారము చేసిన ఇతర నటీ నటులు అతిధిలుగా హాజరౌతారని తెలిపారు.

ది .11.01.2026 వ తేదిన 1. డైరెక్టర్  హరీష్ శంకర్  2. నటులు  నవీన్ పోలిశెట్టి మరియు 3. నటులు  కిరణ్ అబ్బవరం , పిఠాపురము లో జరుగు సంక్రాంతి సంబరములకు

అతిధిలుగా హాజరు కానున్నారని బీసీ శెట్టిబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్ తెలియజేశారు.



Pithapuram