Hot Posts

6/recent/ticker-posts


 తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు

కాకినాడ జిల్లా జగ్గంపేట తిరుమల :తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, వారి కుమారుడు కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు, మనవడు అనీష్ నెహ్రూ, కూతురు తోట సునీత, సోదరులు జ్యోతుల సుబ్బారావు తదితరులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. 

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, వీఐపీలు, ప్రముఖులతో పాటు సాధారణ భక్తులకు కూడా దర్శనం కల్పిస్తున్నామని ఆ దేవదేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని జ్యోతుల నెహ్రూ తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.