జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (NHRPF) - సాధారణ సర్వసభ్య సమావేశం సీఈఓ/చైర్మన్ TS రామచంద్రనాయుడు ఆదేశాల మేరకు..
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ NHRPF ఇంచార్జ్ A. రాంప్రసాద్ , మరియు స్టేట్ ఇంచార్జ్ అహ్మద్ వలిఖాన్ సూచనల మేరకు రంపచోడవరం లో శ్రీ సత్యసాయి మందిర్ నందు మండల ప్రెసిడెంట్ కన్నబాబు ఆధ్వర్యంలో మారేడుమిల్లి రంపచోడవరం మండల సమావేశం నిర్వహించబడింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
తీరందాసు వీరబాబు MA ,LLB జిల్లా లీగల్ అడ్వైజర్, ప్రేమ్ స్వరూప్ జిల్లా బోర్డు కన్వీనర్, అతిథులుగా హాజరయ్యారు ప్రేమ్ స్వరూప్ మాట్లాడుతూ సంస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో కూడా మన సంస్థ సేవలు అందించాలని బాధితులు ఎవరైనా మన సంస్థను ఆశ్రయించిన వారికి వారి తరుపున తగు న్యాయం చేసే విధంగా మన పోరాడాలని సభ్యులందరికీ పిలుపునిచ్చారు
లీగల్ అడ్వైజర్ వీరబాబు మాట్లాడుతూ సభ్యులకు వారికి ఉన్న సమస్యలు పట్ల తగు సూచనలు సలహాలు ఇచ్చారు VM కన్నబాబు మండల ప్రెసిడెంట్, సభ్యులందరినీ సంస్థ బలోపేతానికి అందరు కృషి చేయాలని నూతన సభ్యులను మన సంస్థలోకి ఆహ్వానించాలని ప్రతి ఒక్కరిని కోరారు ఈ కార్యక్రమంలో
రామకృష్ణ దొర రంపచోడవరం డివిజన్ సర్పంచ్ ల సమాఖ్య అధ్యక్షుడు ప్రేమ్ శేఖర్ రెడ్డి ,మండల వైస్ ప్రెసిడెంట్, MVV ప్రసాద్, మండల సెక్రటరీ, సుందర్ కుమార్, మండల జాయింట్ సెక్రటరీ,
ఇతర మండల సభ్యులు/ఏరియా సబ్యులు.. తదితరులు పాల్గొన్నారు
-.