Hot Posts

6/recent/ticker-posts

అక్రమంగా దోచేస్తున్న వసతి గృహాల వార్డెన్లు

కాకినాడ జిల్లా: ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని వసతి గృహాలను ఏర్పాటు చేసి అనేక సౌకర్యాలు కల్పించి వసతి గృహాలకు ప్రభుత్వ భవనాలు లేని చోట ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని వాటికి అద్దె చెల్లిస్తూ విద్యుత్ సరఫరా కి సంబంధించి అయ్యే ఖర్చు పిల్లలు తినడానికి కావలసిన బియ్యం ప్రభుత్వం భరిస్తూ అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేలాగా ప్రతిరోజు మెనూ ప్రకారంగా ఉదయం అల్పాహారం దగ్గర నుండి రాత్రి భోజనం వరకు పదవ తరగతి వరకు ఉండే విద్యార్థులకు నెలకు 1250 రూపాయలు చొప్పున పదో తరగతి పైబడిన విద్యార్థులకు 1650 రూపాయలు చొప్పున ప్రభుత్వాలు భరిస్తూ వసతి గృహాలను నిర్వహిస్తుంటే వార్డెన్లు మాత్రం విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకుండా మెనూ ప్రకారం వారికి తినడానికి తిండి ఏర్పాటు చేయకుండా వారి నోటి దగ్గర కూటిని లాక్కుంటున్నారు.

పదవ తరగతి లోపు చదివే విద్యార్థులకు ప్రతిరోజు వారు చదువుకునే పాఠశాలలలోనే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు అక్కడే భోజనం చేయడం జరుగుతుంది కొంతమంది వార్డెన్లు మాత్రం సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. మరి కొంతమంది వార్డెన్లు చాలా అన్యాయంగా  అక్రమంగా విద్యార్థులకు పెట్టవలసిన ఆహారాన్ని దోచేస్తున్నారు.

ఈ దోపిడీ ముఖ్యంగా బాలికల వసతి గృహాలలో ఎక్కువగా జరుగుతుంది ఎందువలనంటే బాలుర వసతి గృహాలలో బాలురు వాళ్ళు తినే ఆహారం కాస్త ఎక్కువ శాతం లో తింటారు బాలుర వసతి గృహాలలో దోపిడీ తక్కువ ఉన్నప్పటికీ బాలికల వసతి గృహాలలో దోపిడీ ఎక్కువ జరుగుతుంది ఎందువలనంటే బాలికలు తాము తీసుకునే ఆహారం తక్కువ మోతాదులు తీసుకుంటుంటారు.

ఉదాహరణకు ఒక బాలికల వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉంటే వారికి వచ్చే నిధి ఒక విద్యార్థికి 1650 చొప్పున 100 మంది విద్యార్థులకు ఒక లక్ష 65 వేల రూపాయలు ఒక నెలకి విడుదలవుతుంది ఈ ఒక లక్ష 65 వేల రూపాయల నుండి రోజుకు 5500 చొప్పున వసతి గృహం నిర్వాహణకు ఖర్చు చేయాలి ఉదయం అల్పాహారం పాలు గుడ్డు మధ్యాహ్నం భోజనానికి రెండు రకాల కూరలు సాయంత్రం సమయంలో ఏమైనా పండ్లు గాని లేదా అల్పాహారం గాని రాత్రి భోజనంలో రెండు రకాల కూరలతో వారానికి ఒకరోజు కోడి మాంసం తో భోజనం వాళ్లకు అందిస్తూ ఉండాలి కానీ ఇక్కడ జరిగే దోపిడీ ఒక విద్యార్థికి రోజుకి 400 గ్రాముల నుండి 500 గ్రాములు బియ్యం ఉపయోగించవలసి ఉండగా ఒక విద్యార్థికి కేవలం 200 గ్రాముల నుండి 300 గ్రాముల లోపు బియ్యం మాత్రమే ఉపయోగిస్తున్నారు. 

రికార్డులలో మాత్రం ఒక్కొక్క విద్యార్థికి 500 గ్రాముల బియ్యం ఉపయోగిస్తున్నట్లు రికార్డులలో చూపించి మిగిలిన బియ్యాన్ని వార్డెన్లు దోచేస్తున్నారు ఈ విషయం సంబంధిత పై అధికారులకు తెలిసినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు ఇకపోతే 100 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహంలో రోజుకి 10 లీటర్లు పాలు రావాల్సి ఉండగా కేవలం రెండు నుండి మూడు లీటర్లు మాత్రమే వస్తాయి పాలల్లో కాస్త నీళ్లు కలిపితే విద్యార్థులు తాగడానికి వీలవుతుంది కానీ నీళ్ళల్లో పాలు కలిస్తే ఏ విద్యార్థులు అయితే మాత్రం ఆ పాలను ఏ విధంగా తాగుతారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి కూరగాయల విషయానికొచ్చినట్లయితే ప్రతి వార్డెన్లు రైతు బజార్లలో గ్రేడింగ్ చేసిన నాసిరకం కూరగాయలను తక్కువ ధరలకు విక్రయిస్తారు రైతు బజార్లు లేని ప్రాంతాలలో అక్కడ అందుబాటులో కూరగాయల వ్యాపారం చేసే వ్యాపారి దగ్గర నుండి  కూరగాయలను విక్రయిస్తారు. 

ఉదాహరణకు 10 కేజీల కూరగాయలు కొంటే 20 కేజీల కూరగాయలకు రసీదులు తీసుకుంటారు అదేవిధంగా కిరాణా సామాన్లు కూడా తక్కువ ధరలకు వచ్చే సామాన్లు విక్రయించి విక్రయించిన సామాన్లు కంటే రెట్టింపు సామాన్లకు రసీదులు తీసుకుంటారు ఈ విధంగా జరిగే దోపిడీ సంబంధిత అధికారులకు తెలిసి కూడా కేవలం వాళ్లు మాత్రం రికార్డుల ప్రకారంగా రికార్డులో రాసిన రాతలకు అక్కడున్న స్టాకు సరిగా ఉన్నదా లేదా అని మాత్రమే చూస్తారు ఎందుకంటే పై అధికారులు ఎవరూ కూడా ఏ వసతి గృహం దగ్గర ఏం జరుగుతుందో తెలియాలంటే ఎవరు ఎంత దోచేస్తున్నారో తెలుసుకోవాలంటే ఉదయం నుండి విద్యార్థులు రాత్రి భోజనాలు  వరకు వసతి గృహాల దగ్గర పర్యవేక్షించినట్లయితే విద్యార్థులకు ఇచ్చే మెనూ లెక్క ప్రకారం గా అధికారులు దగ్గరుండి హెల్పర్లతో వండించి చూసినట్లయితే ఎంత మిగులుతుంది అనే విషయాన్ని గ్రహించవచ్చు విద్యార్థులు ఉదయం లేచిన దగ్గర నుండి విద్యార్థులు కాలేజీలకు వెళ్లి తిరిగి వచ్చి వాళ్లు నిద్రించే వరకు హెల్పర్లు కష్టపడుతుంటారు. 

కష్టపడిన  వాళ్లకు చాలీచాలని జీతాలు వార్డెన్లకు మాత్రం లక్షల్లో జీతాలు కష్టపడి వసతి గృహాల  నిర్వహణ అంతా చూసుకునేది హెల్పర్లు అయితే ఏ కష్టం లేకుండా దొరికిన కాడికి దోచుకొని దాచుకునేది వార్డెన్లు కానీ ఇక్కడ మీకు ఉదాహరణలో చెప్పిన విధంగా 100 మంది విద్యార్థులు ఉన్న బాలికల వసతి గృహంలో రోజుకి 5500 ఖర్చు చేయవలసి ఉండగా వార్డెన్లు మాత్రం ఖర్చు చేసేది కేవలం రెండు వేల నుండి మూడు వేల రూపాయలు లోపు మాత్రమే రోజుకి 3 వేల రూపాయలు ఖర్చు చేసిన రోజుకు 2500 రూపాయల చొప్పున 30 రోజులకు 75 వేల రూపాయలు కాజేస్తున్నారు. 

రోజువారి బియ్యంలో ఒక విద్యార్థి దగ్గర నుండి 200 గ్రాముల బియ్యాన్ని కాజేసిన 100 మంది విద్యార్థుల దగ్గర రోజుకి 20 కేజీల బియ్యం చొప్పున 30 రోజులకు 600 కేజీల బియ్యం మిగలవలసి ఉండగా ఏ వసతి గృహంలో రికార్డులలో  మిగిలిన బియ్యాన్ని చూపించిన దాఖలాలు లేవు దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు మీ ప్రాంతాలలో ఉన్నటువంటి వసతి గృహాలలో దోపిడీ జరగకుండా ప్రతి  పేద విద్యార్థి కి ప్రభుత్వం నుండి వచ్చే తమ తిండి తమకు దక్కేలా బాధ్యత వహించి మీ ప్రాంతాలలో ఉన్నటువంటి వసతి గృహాలను కాస్త సమయం కేటాయించి పర్యవేక్షించాలని, పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులు ఉన్నత అధికారులు ప్రతి ఒక్కరు కూడా కేవలం వారంలో ఒక రోజైనా వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకొని, సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించే విధంగా ప్రయత్నాలు చేస్తారని, ప్రజా ప్రతినిధులు తాము చేసే ప్రజాసేవలో ఇది ఒక భాగంగా భావించి వసతి గృహాలను పర్యవేక్షించాలని ఆశిస్తున్నాను.                      

సదా మీ సేవలో వలి ఖాన్ ఎన్ హెచ్ ఆర్ పి ఫారం  జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్