అత్యధిక కేసులు పరిష్కరించిన జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ ఎస్ ఐ లు రఘునాధరావు, శివనాగ బాబులకు ఎస్పీ అభినందనలు
ఈనెల 5వ తేదీ శనివారం నిర్వహించిన మెగా జాతీయ లోక్అదాలత్ ద్వారా కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ లోని 116, గండేపల్లి పోలీస్ స్టేషన్ లో 116 కేసులలో కక్షిదారులు,ఫిర్యాదుదారులు, ఇరు వర్గాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ వారితో మాట్లాడి వారి యొక్క కేసులను లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పరిష్కారానికి అత్యధిక స్థాయిలో కృషిచేసి కాకినాడ జిల్లాలో జగ్గంపేట , గండేపల్లి ప్రథమం నిలవడంతో జగ్గంపేట ఎస్సై టి.రఘునాథరావు, గండేపల్లి ఎస్సై శివ నాగబాబు ను , సర్కిల్ లో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారం సేసిన CI ను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు.
శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో C సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు, శివ నాగబాబు లను అభినందిస్తూ ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు...


