భారతదేశ ప్రజలకు టెలిఫోన్ రంగాలలో ఎన్నో సేవలు అందించిన అగ్రకామిక సంస్థ బి ఎస్ ఎన్ ఎల్ దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో స్థాపించారు మహానగరాల నుండి మారుమూల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల వరకు ఏ ఇంటిలో అయినా రింగ్ రింగ్ శబ్దం వినపడిందంటే ఆ ఇంట్లో టెలిఫోన్i ఉన్నదని అర్థం గ్రామీణ ప్రాంతాలలో ల్యాండ్ లైన్ సౌకర్యం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది ఈ సేవలు మారుమూల ప్రాంతాలకు కూడా స్తంభాలను నియమించి తీగల ద్వారా ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు తప్పనిసరిగా ల్యాండ్ ఫోన్స్ సౌకర్యం కలిగించేవారు ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ సమస్త కు సంబంధించి ఎందరో కార్మికులు అనేక కష్టాలు పడి ప్రజలకు సేవలు అందిస్తూ ఉండేవారు ఈ క్రమంలో 2000 సంవత్సరంలో వైర్లెస్ విల్ ఫోన్లను ప్రజలకు అందించాలని ధ్యేయం తో కేంద్ర ప్రభుత్వం టవర్లను నియమించి వైర్లు లేకుండా ల్యాండ్ ఫోన్ పనిచేసే విధంగా సులభమైన ప్యాకేజీల్లో ప్రజలకు అందించారు ఇలా అనేక సేవలతో భారతదేశం అంతా కూడా బిఎస్ఎన్ఎల్ ఎక్కడికక్కడ కార్యాలయాలను స్థాపించి సేవలందించుకుంటూ వచ్చేవారు కోట్ల రూపాయలు లాభాల బాటలో ప్రయాణిస్తున్న బిఎస్ఎన్ఎల్ కాలక్రమీణ కుంటిపడే విధంగా ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఎందుకంటే సెల్ ఫోన్ రావడంతో రిలయన్స్ ఎయిర్టెల్ టాటా ఐడియా వోడాఫోన్ ఇలా అనేక నెట్వర్క్ సంస్థలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహించి బిఎస్ఎన్ఎల్ సమస్త కు సంబంధించిన పరికరాలు ఏమైనా ఇండియాలో మాత్రమే తయారు చేయబడిన పరికరాలను ఉపయోగించాలని నిబంధనలను విధించడం ప్రైవేట్ నెట్వర్క్ వాళ్లు ఇతర దేశాల నుంచి పరికరాలను దిగుమతి చేసుకొని వారు అభివృద్ధి బాటలో పయనిస్తుంటే వారు ఇచ్చే ముడుపులకు కేంద్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్య వైఖరిలో బిఎస్ఎన్ఎల్ సంస్థ నష్టాల బాటలోకి నెట్టి వేయబడింది 2020 సంవత్సరం నాటికి సమస్తలో ఉద్యోగస్తులు 60 శాతానికి పైగా రిటైర్మెంట్లు తీసుకోగా విధి నిర్వహణలో కొంతమంది ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎటువంటి ఆధారం కేంద్ర ప్రభుత్వం చూపించకుండా వారి కుటుంబాలను దిక్కులేని దయనీస్థితిలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎందరు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఆ కుటుంబాలను దయనీయ పరిస్థితుల్లోని జీవితాలను గడుపుచున్నారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించవలసి ఉండగా ఇప్పటివరకు కూడా తిరిగి ఉద్యోగాలు ఇవ్వకుండా కొత్త పోస్టులను భర్తీ చేయకుండా తూతూ మంత్రంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయాలను నడుపుతున్నారు అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ మొబైల్ సిమ్ వినియోగదారులకు సరైన సౌకర్యాలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు ఈ క్రమంలో ప్రైవేట్ నెట్వర్క్ ల వినియోగదారుల శాతం అమాంతంగా పెరిగిపోవడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమేనని స్పష్టంగా తెలుస్తుంది బిఎస్ఎన్ఎల్ టవర్స్ ద్వారా ఇచ్చే సిగ్నల్స్ పరిమితికి మించి ఇవ్వకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించి ఉద్యోగస్తులను కట్టుదిట్టం చేసి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ సరిగా లేకుండా చేసి వినియోగదారులకు ఇబ్బంది కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తన ఉంది ప్రైవేట్ నెట్వర్క్ వాళ్లకు మాత్రం ఏ విధమైన ఆంక్షలు ఉండవు ఎందుకంటే ప్రైవేట్ నెట్వర్క్ ల వాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే విధంగా వారి కనుసైగల్లో ప్రభుత్వం నడిచే విధంగా ప్రధానమంత్రి సైతం వాళ్లకు శిరస్సు వంచి వాళ్ల అడుగులకు మడుగులెత్తుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలను కాపాడేది ఎవరు ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్లకు ఈ ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అటువంటి పరిస్థితుల్లో భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ సహకారాలు లేనప్పుడు ఎవరి మాత్రం ఏమి చేయగలరు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్పిన సామెత ప్రకారం ఎవరికి అవకాశం ఉన్నంతలో వాళ్లు దొరికిన కాడికి దోచుకో దాచుకో అన్న మాదిరిగా వ్యవహరిస్తున్నారు సామాన్యులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ బ్యాంకుల నుండి రుణాలు పొందాలంటే సివిల్ స్కోర్ అంటూ కొత్త నిబంధనలను పెట్టి సివిల్ స్కోర్ లేని వాళ్లకు రుణాలు ఇవ్వబడవు అని నిబంధనలు నియమించారు ప్రైవేటు సంస్థలు నిర్వహించుకునే వారికి ఏ సివిల్ స్కోర్ ఆధారంతో రుణాలు మంజూరు చేస్తున్నారు ప్రభుత్వం విధించే ఆంక్షలు కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకు సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయి బడా బాబులకు ఏ ఆంక్షలు లేకుండా బ్యాంకులవారు కోట్లకు కోట్లు రుణాలు మంజూరు చేస్తారు వాళ్ళు ఎగ్గొట్టిన రుణాలు ప్రజల నుండి తిరిగి ఈ కేంద్ర ప్రభుత్వం టాక్స్ ల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం అభివృద్ధి అయ్యేది ఎప్పుడు నిరుద్యోగ సమస్య తీరేది ఎప్పుడు ఏది ఏమైనాప్పటికీ ఇటు ప్రభుత్వాలు అటు ప్రైవేటు సంస్థల వారు ఆడే ఆట లో బలి అయ్యేది మధ్యతరగతి ప్రజలు మాత్రమే భారతదేశం బాగుపడాలంటే ప్రభుత్వాలలో కాదు మార్పు రావాల్సింది ప్రజలలో మార్పు వచ్చినప్పుడే దేశం బాగుపడుతుంది యువత ఆలోచనతో మేలుకోవాలని ప్రజలు వాపోతున్నారు
