Hot Posts

6/recent/ticker-posts

శాకంబరీ దేవి అవతారంలో శ్రీ వాసవి అమ్మవారు

సామర్లకోటలో శాకాంబరీ దేవి అవతారంలో శ్రీ వాసవి అమ్మవారు

కాకినాడ జిల్లా సామర్లకోట మండల కేంద్రంలోని పెద్ద బజారు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆషాఢ మాసం సందర్భంగా కందుకూరి భద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని కూరగాయలు,పండ్లతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో

మహిళలు సామూహికంగా

అమ్మవారికి చీర సారెలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో కటకం త్రిమూర్తులు,కటకం సతీష్,కుసుమంచి బాబీ,కంచర్ల నాగేశ్వరరావు,కటకం కృష్ణ సుజన్,దొంతుల రమేష్,కంచర్ల మల్లిబాబు,కంచర్ల సత్యనారాయణ,కంచర్ల భాగ్యలక్ష్మి కటకం రత్న కుమారి,కటకం హైమావతి,

కంచర్ల సుష్మ,కంచర్ల కుమారి, కంచర్ల లలిత,కటకం స్వాతి, పాలకుర్తి శాంతి,సంగీత,దివ్య,శ్రీలక్ష్మి, రజని,ఉమ,రమాదేవి,నేతి సుష్మ, కందుకూరి లక్ష్మి,కంచర్ల లక్మి,రాధ, సీత తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు