Hot Posts

6/recent/ticker-posts

మార్కెట్ కమిటీ డైరెక్టర్గా షేక్ వల్లి



 జగ్గంపేట జామియామసీదు కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ వల్లికి ఘనసత్కార0

కాకినాడ జిల్లా జగ్గంపేట  స్థానిక కాకినాడ రోడ్ లోని జగ్గంపేట జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ వల్లికి ఘన సత్కారం చేశారు. జిల్లా వర్క్ బోర్డ్ కమిటీ మాజీ చైర్మన్ గపూర్ ఆధ్వర్యంలో పూలమాలలో సాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గపూర్ మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా మా ముస్లిం సోదరులు జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన షేక్ వల్లిని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించడం తో ఈరోజు మా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించుకున్నామని మా ముస్లింలను గుర్తించి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జామియా మసీదు కమిటీ ప్రెసిడెంట్ ఆరిఫ్, చిన్న కాజా, పెద్ద కాజా, ఎండి భాష, షేక్ సలీం, సయ్యద్ బాజీ, ఎస్.కె రెహమాన్, మసీదు కమిటీ సభ్యులందరూ  పాల్గొన్నారు.