సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ లో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి మణిమ్మ
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం లో స్థానిక ప్రభుత్వ పాఠశాల లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి, జగ్గంపేట కోపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి మ్మ పాఠశాల విద్యార్థులు అందరికి విద్యార్థి మిత్ర కిట్ లను పంపిణి చేసారు. ఈ సందర్బంగా జ్యోతుల మణి మ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ లో పెను మార్పులు వచ్చాయి అని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో పాఠశాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ మంచి ఫలతాలను తీసుకొచ్చారని ప్రభుత్వం విద్యార్థుల కు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో స్కూల్ బ్యాగ్, షూస్, స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు కిట్ల ను అందచేస్తుంది అని అన్నారు.అలాగే స్కూల్ పిల్లలకు ఇచ్చే వస్తువులపై ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోస్ లేకుండా ఇవ్వడం, ఈ కిట్ల పంపిణీ పధకానికి విద్యావేత్త మరియు భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమం లో క్లస్టర్ ఇన్చార్జి బస్వా చినబాబు, గ్రామ టిడిపి అధ్యక్షులు జ్యోతుల నాగబాబు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు