జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. తిరుపతిరావు హెచ్చరిక.
కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఉత్తర్వులతో, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు ఆధ్వర్యంలో, ఎస్సై టి. రఘునాథరావు మరియు పోలీస్ సిబ్బంది బుధవారం రాత్రి ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని గురువారం గౌరవ పెద్దాపురం కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఎస్సై టి. రఘునాథరావు తెలిపారు.
వారిని పెద్దాపురం గౌరవ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా నలుగురికి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున 40 వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిందితులను పెద్దాపురం సబ్ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. తిరుపతిరావు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.
జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని,తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు హెచ్చరించారు.
------------------------------
