Hot Posts

6/recent/ticker-posts

జగ్గంపేటలో పేదలకు ఆపన్నహస్తం: సీఎంఆర్ఎఫ్ కింద రూ.6.90 లక్షల చెక్కులు పంపిణీ చేసిన.. జ్యోతుల నవీన్



 జగ్గంపేటలో పేదలకు ఆపన్నహస్తం: సీఎంఆర్ఎఫ్ కింద రూ.6.90 లక్షల చెక్కులు పంపిణీ చేసిన.. జ్యోతుల నవీన్  


కాకినాడ జిల్లా, జగ్గంపేట జూన్ 14:  జగ్గంపేట రావులమ్మ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ . నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు రూ.6,90,766 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు , నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.  

ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో వైద్యం చేయించుకుని ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు మంజూరయ్యాయని తెలియజేశారు. ఆదివారం జ్యోతుల నవీన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశామని తెలియజేశారు.  

వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని మణిబాబు పేర్కొన్నారు. అర్హుల దరఖాస్తులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కార్యాలయంలో స్వీకరిస్తామని, వెంటనే ప్రభుత్వానికి పంపి సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశాడు.  అనారోగ్యంతో కుంగిపోయిన పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పెద్ద ఊరటనిస్తోందని, ప్రభుత్వ సాయాన్ని సకాలంలో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, వీరం రెడ్డి కాశి బాబు, రేఖ బుల్లి రాజు, పాండ్రంగి రాంబాబు, మండపాక అప్పన్న దొర, పీలా మహేష్, నండ్ల  చిరంజీవి,  పోతాబత్తుల శ్రీను, గల్లా శ్రీను, భవన పోసియ్యా , కరణం బోరయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.