2024 తరహా ఆధిక్యం స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగాలి - శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 11: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై క్షేత్రస్థాయి ప్రతినిధులు పూర్తి అవగాహన పెంచుకోవాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సూచించారు.
బూతే పునాది: జగ్గంపేట గోకవరం రోడ్ లోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో నాలుగు మండలాల తెలుగుదేశం క్లస్టర్, యూనిట్, బూత్ బాధ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓట్ల గల్లంతుపై నిఘా: పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల ఓట్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి క్షేత్రస్థాయి ప్రతినిధి బాధ్యత వహించాలన్నారు.
లక్ష్యం స్థానిక ఎన్నికలు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వచ్చిన ఆధిక్యమే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రావాలంటే ఇప్పటి నుంచే బూత్ స్థాయిలో అర్హులైన ఓటర్లను చేర్పించాలని పిలుపునిచ్చారు.
సవరణే గెలుపు బాట: "జాబితా సవరణ సాధారణ కార్యక్రమం కాదు. రేపటి విజయానికి ఇదే మూలం. ప్రతి నాయకుడు, కార్యకర్త దీనిపై దృష్టి పెట్టాలి" అని నెహ్రూ పేర్కొన్నారు.
ముఖ్య సూచన: "ఓటరు జాబితా సరిగ్గా ఉంటేనే బూత్ లో గెలుపు సాధ్యం. బూత్ గెలిస్తేనే నియోజకవర్గం గెలుస్తాం. సవరణలో నిర్లక్ష్యం వద్దు. ఇంటింటికీ తిరిగి అర్హులందరినీ ఓటరుగా నమోదు చేయించండి" అని నెహ్రూ దిశానిర్దేశం చేశారు.

