మహిళా రిజర్వేషన్.. సీట్ల పెంపు... ప్రజాస్వామ్య బలోపేతమా.. లేక ఖర్చు భారమా.. భారతదేశంలో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం గురించి ఎవరూ విభేదించడం లేదు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో తీసుకునే నిర్ణయాలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయా... లేక కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయా... అనే ప్రశ్న ఇప్పుడు కేంద్ర బిందువు అయింది.
సీట్ల పెంపు :.. ప్రయోజనమా.. భారమా.
ప్రస్తుతం ఒక ఎంపీపై సంవత్సరానికి సగటున నాలుగు నుండి ఐదు కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా... ఈ నేపథ్యంలో లోక్ సభ సీట్లను భారీగా పెంచడం అనేది :ప్రభుత్వ ఖర్చులను గణనీయంగా పెంచుతుంది పన్నుల రూపంలో ప్రజలపై అదనపు భారం వేస్తుంది కానీ అదే స్థాయిలో పాలన నాణ్యత పెరుగుతుందా అన్నది స్పష్టత లేని అంశం సంఖ్య పెరిగితే ప్రతినిధుత్వం పెరుగుతుందనేది సిద్ధాంతం. కానీ చర్చల నాణ్యత, విధానాల అమలు, పార్లమెంటరీ శాస్త్రం మెరుగుపడకపోతే.." ఇది కేవలం సంఖ్యల రాజకీయమే అవుతుంది " పార్లమెంటరీ వ్యవస్థలో అసలు సమస్య : భారత పార్లమెంటులో ఇప్పటికే తరచూ కనిపించే అంశాలు :
అరాచకాలు, నినాదాలు, సభ స్తంభన.చట్టాలపై లోతైన చర్చల కొరత,పార్టీ విప్ కారణంగా వ్యక్తిగత అభిప్రాయాల లేమి ఇలాంటి పరిస్థితుల్లో సభ్యుల సంఖ్య పెరిగితేచర్చల నాణ్యత మెరుగుపడే అవకాశాల కంటే, గందరగోళం, రాజకీయ తగాదాలు పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తాయి.మహిళా రిజర్వేషన్ బిల్లు : రాజకీయ వ్యూహమా. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి.. ఎత్తుగడగా కనిపిస్తోంది ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడటం ప్రతిపక్షాల ఐక్యత పెరగడం
డీలిమిటేషన్, జనగణన, ఓబిసి ప్రాతినిధ్యం వంటి అంశాలు.ప్రధానంగా బిల్లును సీట్ల పెంపుతో ముడి పెట్టడం వల్ల ఉత్తర... దక్షిణ.. అసమాన తలపై భయాలు పెరిగాయి జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన వివాదాస్పదమైంది. రాజకీయ పార్టీల మధ్య నమ్మకం మరింత తగ్గింది
మహిళా ఓటు బ్యాంకు రాజకీయాలు:
దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అందుకే: అన్ని పార్టీలు మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నాయి
ఎన్నికల వ్యూహాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు
మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో మహిళలకు టిక్కెట్లు ఇచ్చిన ఘనత
కన్యశ్రీ వంటి పథకాల ద్వారా మహిళల్లో ప్రభావం పెంచుకోవడం లక్ష్మీ బండారు వంటి పథకాలతో.. మమతా బెనర్జీ ఇప్పటికే.. దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ రూపొందింది.
బెంగాల్ రాష్ట్రంలో ఉన్న 29 మంది ఎంపీలు 11 మంది మహిళలకు ఇచ్చిన ఘనత సాధించిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్..ఇటువంటి చర్యలతో మమతా బెనర్జీ ముందుంది.ఇది చూపిస్తున్నది ఏమిటంటే.
మహిళా ప్రాతినిధ్యం పెంచడం కోసం రాజ్యాంగ సవరణ ఒక్కటే మార్గం కాదు. అసలు పరిష్కార దిశగా: సీట్ల పెంపు కంటే ముందు చేయాల్సిన కీలక సంస్కరణలు పార్లమెంటరీ సంస్కృతి మెరుగుదల నాణ్యమైన చర్చలు కమిటీ వ్యవస్థ బలోపేతం
రాజకీయ పార్టీల బాధ్యత స్వచ్ఛందంగా మహిళలకు టిక్కెట్లు ఇవ్వడం అంతర్గత ప్రజాస్వామ్యం పెంపు
ఎన్నికల సంస్కరణలు డబ్బు, కులం, మతం, ప్రభావం తగ్గించడం ప్రాతినిధ్యం కేవలం సంఖ్య కాదు
సామర్థ్యం, నిబద్ధత, ప్రజల సమస్యలపై, అవగాహన కూడా ముఖ్యమే.మహిళా రిజర్వేషన్ లక్ష్యం గొప్పది. కానీ దాన్ని అమలు చేసే విధానం కూడా అంతే బాధ్యతతో ఉండాలి.
సీట్ల పెంపు ద్వారా సంఖ్య పెరగొచ్చు.. కానీ ప్రజాస్వామ్యం బలపడాలంటే:చర్చల నాణ్యత పెరగాలిరాజకీయ నైతికత బలపడాలి ప్రజల సమస్యలకు పరిష్కారం కనబడాలి.లేకపోతేకొత్త సీట్లు.... పాత సమస్యలు" అనే స్థితి మారదు.
పల్లూరి రామమోహన్ పొలిటికల్ అనలిస్ట్
