Hot Posts

6/recent/ticker-posts






 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న.. ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ

ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం... ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక సెంటర్లోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట నియోజకవర్గం ఎంపీడీవోలు, ఏపీఎంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, పాల్గొన్నారు. మరో అతిథిగా జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూ సతీమణి నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి, మహిళా మణులు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రార్ధన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి తో పాటు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ ఘనపరిచిన 30 మంది మహిళలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. 

అమరావతిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సమావేశాన్ని  ప్రత్యక్ష ప్రసారంలో ఎమ్మెల్యే తో పాటు మహిళా మణులు అందరూ తిలకించారు.  ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. మహిళలు విద్యతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. 

మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో ప్రతిభ చాటతారని కుటుంబం నుంచి సమాజం వారికి వారి సేవలు వెలకట్టలేని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ప్రభుత్వం పరంగా మహిళా అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారం అందించటం జరుగుతుందని, అలాగే మహిళా స్వయం ఉపాధికి తగిన ప్రోత్సాహం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇంటికే పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలవాలని విద్యార్థినిలకు  సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామిక వేత్తం తయారు చేయడానికి అహర్నిస్తూ కృషి చేస్తున్నారని అన్ని రంగాలలో మహిళలు ఉన్నత స్థానాలలో ఉండాలన్నారు తద్వారా సమాజంలో మహిళలకు గౌరవం, గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు కూటమి నాయకులు పాల్గొన్నారు.