Hot Posts

6/recent/ticker-posts




 జాతీయ రహదారి నిర్మాణంలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలి .... సారవంతమైన వ్యవసాయ భూములు కాపాడాలి.... ఢిల్లీలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట :రైతుల ప్రయోజనాల దృష్యా.. ఢిల్లీలో 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్' కి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. కాకినాడ జిల్లాలో  రామవరం - తాళ్ళూరు  గ్రామాల మధ్య ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు (10.45 కి.మీ)ను పునఃసమీక్షించాలని, ఇప్పటికే పలుమార్లు భూసేకరణలో పోలవరం కాలువకు, పురుషోత్తపట్నం పైప్ లైన్, పుష్కర కాలువకు, విశాఖ విస్కో పైప్ లైన్, పెట్రోలు డీజిల్ పైప్ లైన్, హై టెన్షన్ విద్యుత్ టవర్ల  వల్ల వందలాది ఎకరాలు సారవంతమైన భూమిని కొల్పోయిన కొన్ని వందల రైతుల కుటుంబాల నిరాశ్రయులయ్యారని మళ్లీ ఇప్పుడు  154.93 ఎకరాల సారవంతమైన ఎక్వేర్ చేయడం వల్ల సారవంతమైన వ్యవసాయ భూములు కోల్పోతారని ఈ గ్రామాలలో బైపాస్ బదులు  పాత ఫ్లేవర్లు బ్రిడ్జి తీసి స్తంభాలతో కూడిన ఎలిమినేటెడ్ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసి రైతులకు జీవనోపాధి కల్పించాలని వినతి పత్రం సమర్పించి విజ్ఞప్తి చేయటం జరిగింది. 

ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర పౌర విమానాయాన శాఖా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా కలిసి ఈ సమస్యపై వినతిపత్రం అందజేయగా ఆయన కేంద్ర మంత్రి నితిన్ గత్కారికి వివరించి సమస్య పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.