Hot Posts

6/recent/ticker-posts



 గుర్రప్పాలెం లో స్వచ్ఛ రథం టాక్టర్ ప్రారంభించిన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంగుర్రప్పాలెం: స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద చేపడుతున్న వివిధ పనుల ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పునర్నిర్వచిస్తున్నామని, గ్రామాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజల ఆరోగ్యంగా ఉండాలని దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్, స్వచ్ఛంధ్ర తీసుకువచ్చాయని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. 

జగంపేట మండలం  గుర్రప్పాలెం గ్రామపంచాయతీ కి స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా  పంచాయతీకి స్వచ్ఛ రథం నూతన టాక్టర్ ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన పుష్‌ కార్టులు, ఈ-ఆటోలను కూడా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నారని. మార్చి నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మేర ఇంటింటా చెత్త సేకరణ జరిగే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారని  ఇళ్లలో పనికిరాని వస్తువులను స్వచ్ఛ రథాల ద్వారా సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించడం జరుగుతుందని దీనివల్ల ప్రజలు రోడ్లపై చెత్త పడేయకుండా ఉంటారన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ రథాల విధానాన్ని దశలవారీగా అమలులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని, తద్వారా ఇంటి వద్దనే 100 శాతం చెత్తను సేకరించవచ్చన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్‌ సిక్స్‌ పథకాలను నిర్ణీత సమయం కంటే ముందే అమలు చేసి సూపర్‌హిట్‌ చేశామని నవీన్ అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీనుమణి బాబు, బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి, రేఖ బుల్లి రాజు, దాట్ల సూర్యనారాయణ రాజు, పీల మహేష్, పడాల రాంబాబు, పడాల ఈశ్వరరావు, పడాల బాలాజీ, పడాల విష్ణుమూర్తి, కురందాసు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.