Hot Posts

6/recent/ticker-posts



 అవినీతి నిరూపించలేక పోతే  మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా...

నిరూపిస్తే మీరు దోచిన డబ్బు ప్రభుత్వానికి కడతారా...

జ్యోతుల నెహ్రూ నవీన్ లకు సవాలు విసిరిన పాటంశెట్టిసూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి 


కాకినాడ జిల్లా, జగ్గంపేట  ఫిబ్రవరి, 19, 2026 జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం: బూరుగుపూడి గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పాఠం శెట్టి సూర్యచంద్ర తమ స్వగృహం యందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 

జగ్గంపేట నియోజకవర్గంలో జరిగినటువంటి మట్టి ఇసుక అవినీతిపై ౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు  జగ్గంపేటలో ఎన్నికల ప్రచారసభలో జగ్గంపేట నియోజకవర్గంలో విపరీతమైన మట్టి ఇసుక తోలకాలు జరిగాయని అవినీతి అనకొండలుగా మారి ప్రజాధనం దోచుకు తిన్నారని అవినీతిపై ప్రశ్నించాలని,భయపడకుండా ధైర్యంగా అవినీతి చేసే వారిపై పోరాడి వారు చేసిన అవినీతిని అందరికీ తెలిసే విధంగా ప్రజలందరూ తమ గళం వినిపించాలని తెలిపిన వీడియోని చూపిస్తూ నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా ఎక్కడ అని జ్యోతుల నెహ్రూ ని, జ్యోతుల నవీన్ ని సూర్యచంద్ర ప్రశ్నించారు. 

ఈ రెండు సంవత్సరాల్లోనూ జగ్గంపేట నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణాలో 200 కోట్లు పైనే అవినీతి జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని నిరూపించ లేకపోతే జగ్గంపేట నడిబొడ్డున మీరు ఏర్పాటు చేసిన సమావేశంలో నేను మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పి రాజకీయాల నుండి తప్పుకుంటానని, మీరు చేసిన అవినీతి నిరూపించినట్లయితే మీరు దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని పాటంశెట్టి సూర్యచంద్ర షరతులు తెలియజేయడం జరిగింది.

రెవెన్యూ మైనింగ్ డిపార్ట్మెంట్ లతో మామిడాడ, కృష్ణవరం, గండేపల్లి, మురారి, నాయకంపల్లి, ఎన్ టి రాజాపురం, రంపయర్రంపాలెం, వీరలంకపల్లి ,బావాజీపేట, సూదికొండ, వేలంక ఇంకా అనేక గ్రామాలలో మరియు మట్టి ఇసుక ఓవర్ లోడ్ లారీలు ప్రభుత్వ టోల్గేట్  లోకి వెళ్లకుండా బూరుగుపూడి కృష్ణవరం మధ్యలో పోలవరం, పుష్కర కాలువలనుండి రాత్రి పగలు తోలుతున్న మీ పర్సనల్ టోల్గేట్ ఆదాయం, ఏలేరులో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న గ్రామాలలో ఇసుక తీసిన అన్ని ప్రాంతాలను స్వయంగా చూపించి అవినీతి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని టైము డేటు ప్లేస్ గౌరవ శాసనసభ్యులు  జ్యోతుల నెహ్రు  గౌరవ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్  జ్యోతుల నవీన్  నిర్ణయించుకుని తెలియచేయాలని పాటంశెట్టి సూర్యచంద్ర మీడియా ద్వారా కోరారు ఈ కార్యక్రమంలో బూరుగుపూడి గ్రామస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు