మంత్రుల జీవితాలు విలాశాలకు మాత్రమే పరిమితం ..
సొంత నిర్ణయాలు ప్రకటిస్తే నాటి నుండి శునక జీవితమే అనే హెచ్చిరికలు ..
జీతాలు తీసుకోండి . ప్రతి నెలా ఇచ్చే అవినీతి సొమ్ములుతో దర్జాగా బ్రతకండి .
మేడా శ్రీనివాస్ , విమర్శ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం : రోజుకు 3 కోట్లు తీసుకుంటున్న ఆ మంత్రి ఎవరు ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేసారు .
కార్పొరేట్ రాజకీయ పార్టి ల నుండి ఎన్నికవుతున్న ఎమ్మెల్యే - ఎంపి ల బ్రతుకులు ప్రజలకు సేవచేయటానికి కాదు అమాత్య గురువులకు ఒంగి ఒంగి సలాములు చేస్తు బాంచన్ దొర అంటు వారి బానిసత్వాన్ని ఎప్పటికప్పుడు ఋజువు చేసుకోవటమే చట్ట సభలకు ఎన్నికయ్యే వారి విధులు అన్నారు . ఒక పంచాయితీ మెంబర్ కు ఉన్నటువంటి అర్హత నేటి ఎమ్మెల్యే - ఎంపి లకు లేకపోయింది . గత 20 ఏళ్ల నుండి ఇప్పటిదాకా ఎన్నికైన ఏ ఒక్క ప్రజా ప్రతినిధి అయినా తన సొంత నియోజకవర్గానికి సంబందించిన ఏ ఒక్క సమస్య పైన గాని , ఉద్యోగ ఉపాధి మార్గాల కోసం గాని స్వయం నిర్ణయాధికారంతో చట్ట సభలో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల నుండి ప్రతినిత్యం వహిస్తున్న వారు ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా అని ఆయన సూటిగా ప్రశ్నించారు ..
చట్టం లేదు పాలన లేదు అవినీతి ఒక్కటే శాసనం. ప్రశ్నిస్తే తప్పవు వేధింపులు . అక్రమ కేసులు అన్నట్టు పాలన సాగుతుందన్నారు .
పాలకులకు భయపడుతు బిడ్డలకు ఉగ్గుపాలు వలే భయాన్ని నూరిపోస్తున్న తల్లిదండ్రులు పెంపకంలో పిల్లల భవిష్యత్ ప్రేమతో గల భయం వారిని నిత్యం వెంటాడుతుంది .
చట్టాలు అమలు కావు . న్యాయం ఖరీదైనదిగా మారింది . హక్కును అడుక్కోవాలి . న్యాయాన్ని కొనుక్కోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు సేవ - పాలన అనకుండా కేవలం జీతాలు , అవినీతి ముడుపులు తీసుకుని జీవితాలను విలాసంగా గడపండి . అంతకు మించి ఆలోచిస్తే గడ్డు పరిస్థితులు తప్పవని సొంత నిఘా వర్గాల ద్వారా హెచ్చిరికలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి . ఒక మంత్రి నిజంగా ప్రజలకు మంచి చెయాలనుకుంటే తనకు వున్న అధికారంతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా చరిత్ర కారులుగా నిలిచిపోవచ్చును . కాని నేటి మంత్రులు బానిసకు మించిన బానిస వలే వారి విశ్వాసాన్ని కార్పొరేట్ రాజకీయ పార్టిల అధినేతకు చూపిస్తున్నారు . ఆ గౌరవ స్థానం కల్పించిన ప్రజల పట్ల కనీసం విశ్వాసం చూపలేక పోతున్నారని ఆయన తీవ్ర మనస్థాపం చెందారు .
నేటి సమాజంలో కొన్ని మూగ జీవాలకు వున్న స్వేచ్చ , స్వాతంత్య్రం ప్రజాస్వామ్యంలో మనుషులకు ఉండటం లేదన్నారు . ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి నని సొంత నిర్ణయాలు తీసుకున్నా ప్రకటించినా నాటి నుండి శునక జీవితాలకు పరిమితం కావటమే ననే భయం ప్రస్తుత ప్రజా ప్రతినిధులను వెంటడుతూనే వుంటున్నాయి . ప్రస్తుత కార్పొరేట్ రాజకీయ పార్టి ల నుండి చట్టసభలకు వెళ్తున్న వారు భయట మాత్రమే వారి ఫోజలు చాటు కుంటారు . లో లోన కుమిలి కుమిలి ఏడవటమే నన్నారు. ఒకప్పటి చట్ట సభల్లో సమస్యలు, అభివృద్ధి , భద్రత , సంక్షేమం , ఉద్యోగ, ఉపాధి మార్గాలు, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై చర్చలు సాగేవి . నేటి చట్ట సభల్లో చర్చలు లేకపోగా ఒక వర్గం బూతులను మరో వర్గం చప్పట్లు కొట్టటమే పనిగా ప్రజా ప్రతినిధులు బాధ్యతలను పొందిస్తున్నారు .పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటున్నారు . నేడు చట్ట సభలకు వెళుతున్న వారి కన్నా ఇంటి ముందు విశ్వాసంగా వున్న శునకం చాలా మెరుగైన సేవలు అందిస్తుందని పలువురు గుసగుసలు వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు .
భయం , బలహీనతలే మానవ జీవితానికి ప్రాదిమిక హాక్కు , అదే జీవనాదారంగా సాగుతున్న పాలన సమాజానికి దురదృష్టం అన్నారు .
బ్రతుక్కి అర్ధం లేదు . చావుకు కారణం లేదు . కన్న బిడ్డలను చంపుతున్నా , ఆడ బిడ్డలు వివస్త్రలు అవుతున్నా గొంతు మూగ బోవాల్సిందే ఇదే అత్యధిక శాతం బ్రతుకులుగా వుంటున్నాయి .
బిడ్డను కాపాడుకోలేము . హక్కును పొందలేము . ఇంత హీనమైన జీవితం ఓటర్లుకు మాత్రమే సాధ్యం అన్నారు . రోజు రోజుకు మానవత్వం తరిగిపోతుంది .
ఇలాంటి రాక్షస పాలనలోను, బక్షక సమాజం లోను అతి తక్కువ మానవ సమాజం మిగిలి ఉందంటే దేవుడు వున్నాడు అని చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా ! భయం బలహీనతలతో సామజిక ఉగ్రవాదాన్ని చూస్తు గడిపే వాడిని ఈ సమాజంలో భగవంతుడు మాత్రమే శిక్షిస్తునే వున్నాడు .
ఈ కలుషిత పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించే రోజులు ఆ దైవ శక్తికి మాత్రమే వున్నాయి .
ప్రస్తుత పాలకులకు జేజేలు కొట్టె వాడిని , జెండాలు కట్టే వాడిని ఆత్మ విమర్శ చేసుకోమనండి . ఎవరి పాడేకు వారే జెండా కట్టుకుంటున్నారనటంలో సందేహమే లేదు . ఎందుకు జేజేలు కొట్టు చున్నారు అనే నిజం తెలుసుకునే సమయానికి మొత్తం శున్యం అని అర్ధం అవుతుందని ఆయన హితవు పలికారు .
ప్రస్తుత కూటమి సర్కార్ లో రోజుకు 3 కోట్లు అవినీతి సొమ్ము తీసుకుంటు పాలనను , తన శాఖను గాలికి వదిలేసిన ఆ మంత్రికి ఆంధ్ర రాష్ట్రంలో పరాభవం తప్పదాన్నారు . ఆంధ్రులకు , ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కు ద్రోహం చేస్తు తన వ్యక్తిగత సొంత రాజకీయ ప్రయోజనాలు పొందుతున్న ఆ అత్యున్నత మంత్రి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు ..
ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .
ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ మేడిచర్ల శ్రీనివాసరావు , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , పసుపులేటి వీర్రాజు , బసా సోనియా, కాకర ప్రసాద్ , చల్లా శివ దుర్గా ప్రసాద్ , చల్లా అఖిల్ , తదితరులు పాల్గొనియున్నారు ..
