Hot Posts

6/recent/ticker-posts




 ఇర్రిపాకలో శివ కేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి 7, 8,9 తేదీలలో శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం.. భక్తులందరికీ ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేయించేసి ఉన్న శివ కేశవుల క్షేత్రంలో ఈనెల 7, 8, 9 తేదీలలో నిర్వహించి తలపెట్టిన శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం సంబంధించిన ప్రచార గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6:00 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస్ కళ్యాణం తిరుమలలోని ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి అక్కడి వేద పండితులతో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవం, సాయంత్రం 6:00 నుండి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 6:00 నుండి శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలియజేశారు

. ఈ కార్యక్రమాలకు టీటీడీ బోర్డు చైర్మన్ బీ ఆర్ నాయుడు, టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నిర్వహించే అన్నవరం సత్యనారాయణ స్వామి గారి సామూహిక వ్రతం లో పాల్గొనే భక్తులు ఫిబ్రవరి 4వ తేదీ నుండి జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోను, ఇర్రిపాక శివకేశుల క్షేత్రంలోనూ, జగ్గంపేట నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జిల వద్ద పేరును నమోదు చేయించుకుంటే వారికి వ్రతం సంబంధించి అన్ని సామాన్లు సమకూర్చడం జరుగుతుందని అన్నారు. ఈ క్షేత్రం కు రవాణా సౌకర్యం అందుబాటులో లేని కారణంగా జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మహిళా భక్తులను బట్టి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ మూడు రోజులు ఇర్రిపాక శివకేశవ క్షేత్రంలో జరుగు ఈ కళ్యాణ మహోత్సవాలకు భక్తులందరూ విచ్చేసి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులు కావలసిందిగా కోరుచున్నానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. 

ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, కొత్తకొండ బాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, కంచుమర్తి రాఘవ, దాపర్తి సీతారామయ్య, పీల మహేష్, నండ్ల చిరంజీవి, వైభోగుల కొండబాబు యాదవ్, అన్నవరం రిటైర్డ్ పిఆర్ఓ తులా రాము, మోరుకుర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.