కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యత స్వీకరించి ఫిబ్రవరి ఒకటో తేదీ కాకినాడ పిఆర్ కాలేజీ మెక్లరిన్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టిడిపి రాష్ట్ర నాయకులు మహాసేన రాజేష్, గుణ్ణం చంద్రమౌళి తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపించి జిల్లాలో తిరుగులేని శక్తిగా మలచిన జ్యోతుల నవీన్ ను మళ్లీ నాయకత్వం ఆయన సేవలను గుర్తించి రెండోసారి జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమించడం తో ఆయన ప్రమాణస్వీకారం మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.