_టోర్నమెంట్ నిర్వహణకు లక్ష 80 వేలు రూపాయలు విరాళం_ఇచ్చిన కంబాల శ్రీనివాస్
_అడ్డతీగల : పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల గ్రామంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన ఏజెన్సీ 12 మండలాల సంబంధించి అల్లూరి సీతారామరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.
ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షతన విశ్వ హిందు ధర్మ పరిరక్షణ రామసేన పోలవరం జిల్లా ఇన్చార్జి కడబాల సుధ అధ్యక్షతన వహించారు ఈ టోర్నమెంటులో రంపచోడవరం నియోజకవర్గం 12 మండలాల నుండి 64 టీములు పాల్గొన్నారు బుధవారం సాయంత్రం ఫైనల్స్ మ్యాచ్, విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలిత ఆయనకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, యువత గ్రామస్తులు, ఘన స్వాగతం పలికారు. ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్న క్రికెట్ టీమ్ లను పరిచయం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్ లను తిలకించారు.
అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మొదటి విజేత టీం కి 30 వేలు రూపాయలు నగదు, కప్పు, రెండో విజేత టీం కి 20 వేలు నగదు, కప్పు, మూడవ విజేత టీం కి 7,500 రూపాయలు నగదు, కప్పు, నాలుగోవ విజేత టీం కి 7,500 రూపాయలు నగదు కప్పు అందజేశారు. పలువురు బెస్ట్ ప్లేయర్స్, బెస్ట్ బౌలర్స్, బెస్ట్ ఆల్ రౌండర్స్ కి 15వేలు రూపాయలు వరకు అందించారు. మొత్తం టోర్నమెంట్ నిర్వహణకు, బహుమతులకు కలిపి కంబాల శ్రీనివాసరావు లక్ష 80 వేలు రూపాయలు విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడలకు సాంస్కృతిక కార్యకలాపాలకు తాను ఎప్పుడు ప్రోత్సాహం అందిస్తానన్నారు. తాను జగ్గంపేట, రాజనగరం నియోజకవర్గాలతో పాటు, గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గంలో మా పెద్దలు పూర్వికులకు గిరిజన ప్రాంతం అన్నం పెట్టిన ప్రాంతమని గిరిజన ప్రాంతం అంటే నాకు అభిమానమని ఇకనుండి గిరిజన ప్రాంతాల్లో జరిగే క్రీడలకు రంపచోడవరం నియోజకవర్గంలో కూడా తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.._ ఈ కార్యక్రమంలో బీర బాలయోగి భూముల ప్రసాద్ కేత పవన్ బాలాజీ విజ్జ్రపు శరత్ రంపచోడవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దంగేటి సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు యువత తదితరులు పాల్గొన్నారు





