పేదలకు నిత్యవసర వస్తువులు, నూతన వస్త్రాలు పంపిణీ
కాకినాడ జిల్లా జగ్గంపేట : తెలుగుదేశం పార్టీ యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి పలు సామాజిక కార్యక్రమాలు చేశారు.
అందులో భాగంగా జగ్గంపేట గోకవరం రోడ్డులో గల జగ్గమ్మ చెరువు సమీపంలో ఉన్న పలు కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, పేదలకు వస్త్ర దానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేస్తున్న అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మా యువ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మా యువ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని తండ్రికి తగిన రాజకీయ వారసుడుగా దూరదృష్టి విజన్ ఉన్న సమర్ధత, నిజాయితీ గల నేతగా నారా లోకేష్ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

