Hot Posts

6/recent/ticker-posts


మాట ఇచ్చి మరిచిన ప్రజాప్రతినిధులను సూటిగా ప్రశ్నిస్తున్న సూర్యచంద్ర

శంకుస్థాపన చేసిన శృంగరాయునిపాలెం కృష్ణవరం బ్రిడ్జి ప్రారంభమెప్పుడు?

పాటంశెట్టి సూర్యచంద్రఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి 

కాకినాడ జిల్లా :జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం కృష్ణవరం బ్రిడ్జిగెలుపే లక్ష్యంగా ఓట్ల కోసం ఎన్నికల ముందు హామీల మీద హామీలిస్తాం,శంకుస్థాపనలు చేసేస్తాం గెలిచి గద్దెనెక్కాక హామీలు గాల్లో కలిపేస్తామంటి చూస్తూ ఊరుకోమని మాటిచ్చి మరిచిన హామీలన్నీ నెరవేర్చేదాక ప్రజల పక్షాన ప్రజా గళం వినిపిస్తూనే ఉంటామని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు.

 కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం కృష్ణవరం బ్రిడ్జి నిర్మించి ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపాలెం, భూపాలపట్నం గ్రామాల ప్రజల చిరకాల కోరిక తీరుస్తానని 2014 ఎన్నికల ముందు ప్రజలని నమ్మించి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల కాలయాపన అనంతరం మళ్లీ ఓట్లు కోసం 2019 జనవరి 26వ తేదీన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మరల 2024 ఎన్నికల ముందు గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మిస్తానని ప్రజలకు వాగ్దానం చేయడం ద్వారా జ్యోతుల నెహ్రూ గారు గెలిచి గద్దెనెక్కి రెండు సంవత్సరాలు అయినా నేటికీ కూడా బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ మొదలుపెట్టి నిధులు మంజూరుకి కృషి చేయకపోవడం చాలా బాధాకరమని  బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి వెంటనే పనులు మొదలుపెట్టి ఎన్నికల హామీని నెరవేర్చి ప్రజలకు శాశ్వత రవాణా సదుపాయం కల్పించాలని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. ఈ మూడు గ్రామాల ప్రజలు ఉపాధి లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని బ్రిడ్జి నిర్మాణం వల్ల శృంగరాయునిపాలెం, ఎస్ తిమ్మాపురం, భూపాలపట్నం గ్రామాలతో పాటు మండల కేంద్రానికి శివారు గ్రామాలైన బూరుగుపూడి,కృష్ణవరం, సోమవరం  గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయం ఏర్పడటం వల్ల చాలా మేలు జరుగుతుందని ఎన్నికల హామీని నెరవేర్చాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు