తుని టౌన్ లో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్
కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ తుని టౌన్ లో 2 వ వార్డు మరియు 3 వార్డులలో (కొండ వారి పేట) కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా స్థానికులకు గంజాయి, ఇతర మత్తుపదార్థాల వలన కలుగు నష్టాలను వివరించి తీసుకోవాల్సిన చర్యల కోసం చెప్పడం జరిగినది. మరియు యువకులకు రోడ్డు ప్రమాదాలు జరగటం వలన కలుగు నష్టాలను వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగింది. సైబర్ క్రైమ్ నేరాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగింది. వార్డులలో పర్యటించి స్థానికులతో మాట్లాడి వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది లోకల్ గా పోలీసు వారు తీసుకోవలసిన చర్యల కోసం మాట్లాడటం జరిగింది. అనంతరం స్థానిక కమ్యూనిటీ హాలు నందు పల్లెనిద్ర కార్యక్రమం చేయడం జరిగింది అని తెలియజేసిన తుని సర్కిల్ ఇన్స్పెక్టర్




