తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం :రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇన్చార్జి కలెక్టర్ మేఘ స్వరూప్ , ఎస్పీ నర్సం కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ విశిష్ట అతిథిగాపాల్గొన్నారు .జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం ఎస్పీ జిల్లా, కలెక్టర్ విద్యార్థులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్, అన్ని ప్రభుత్వ విభాగాల సకటాలను ప్రదర్శించారు. స్వతంత్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సత్కరించిన జ్యోతుల నెహ్రూ, పోలీస్ డాగ్ విన్యాసాలు, స్వతంత్ర సమరయోధుల వేషధారణతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.


