కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ కార్యాలయం నందు సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
సీఐ వై ఆర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు తమ జీవితాలలో ఉన్నత శిఖరాలను అధిగమించడానికి కృషి పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసించి తమ ఉన్నత శిఖరాలను అధిగమించాలని విద్యార్థులు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు గురువులు పెద్దలు పట్ల గౌరవభావాలతో మెలగాలని పెద్దలను గౌరవించాలని విద్యార్థులు చెడు మార్గాలని ఎంచుకోకుండా మంచి నడవడికతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా నడుచుకోవాలని విద్యార్థులకు తమ స్టేషన్ సిబ్బందికి తగిన సలహాలు సూచనలు తెలియజేశారు .
అనంతరం సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టేషన్ సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సర్కిల్ కార్యాలయం సిబ్బంది జగ్గంపేట ఎస్సై రఘునాధ రావు ఏ ఎస్ ఐ లు స్టేషన్ సిబ్బంది జగ్గంపేట డ్రిల్ మాస్టర్ హైస్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు




