Hot Posts

6/recent/ticker-posts





 నాటి స్వాతంత్ర్య వీరుల బాటలో పయనించి దేశసేవలోపునరంకితమవుదాం...

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన దేశ విధానం...

భిన్నత్వంలో ఏకత్వమే మన ఘనత...

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్...

కాకినాడ జిల్లా జగ్గంపేట : జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జ్యోతుల నవీన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, పెద్ద రాజ్యాంగం, చెక్కుచెదరని రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశమని, దేశానికి దశా, దిశా నిర్దేశం చేసిన గొప్ప రాజ్యాంగాన్ని అమలుపరచుకున్న రోజు జనవరి 26 అని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, జగ్గంపేట టిడిపి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరు   స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను తలచుకుని వారి అడుగుజాడల్లో రాజ్యాంగ స్ఫూర్తితో పయనించడమే ఆ మహానుభావులకు మనమిచ్చే నివాళి అన్నారు. 

దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల ఆశయాలను పుణికి పుచ్చుకుని ముందుకు వెళ్లాలన్నారు. గాంధీజీ, నెహ్రూజీ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర సమరయోధులందరినీ స్మరించుకుని వారి బాటలో పయనించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మన దేశం యొక్క గొప్పతనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ఘనతన్నారు. వివిధ మతాలు, జాతులు, కులాలు, భాషలు ఉన్నా మనందరం ఒక్కటే అని, మనమంతా భారతమాత ముద్దుబిడ్డలమని, మనది భారత జాతి..ఆ తరువాతే మరేదైనా..ఏమైనా అనేది గుర్తించుకోవాలన్నారు. 

అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చెంది, దేశ ఐక్యతకు కృషి చేయాలన్నారు. నేటి విద్యార్థులంతా భావి భారత పౌరులుగా ఈ భావనలన్నీ అలమర్చుకొని దేశ సేవకు పునరంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, రాయి సాయి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, పిలా మహేష్, దాపర్తి సీతారామయ్య, నండ్ల చిరంజీవి, నలమాటి ఆనంద్, కోడూరి రమేష్, నే దూరి గణేష్, పలివెల యేసు రాజు, సాంబత్తుల చంద్రశేఖర్, తుమ్మల కిషోర్, వాకా రెడ్డి, ముక్కాపాలు బాబు తదితరులు పాల్గొన్నారు.