కాకినాడ జిల్లా జగ్గంపేటలోని శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలు ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ & కరెస్పాండెంట్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో ఆదర్శవంతంగా సాగింది.
వేడుకల ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి, అలాగే భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఒమ్మి రఘురామ్ జాతీయ జెండాను ఆవిష్కరించగా,జాతీయ గీతాల మధ్య జెండా గర్వంగా ఎగిరింది.ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో నిర్వహించిన పేరేడ్ అందరినీ ఆకట్టుకుంది.
ఈసందర్భంగాఒమ్మిరఘురామ్ విద్యార్థులు,ఉపాధ్యాయులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ఉపన్యాసం అందించారు.
గణతంత్రం అనేది కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ కాదు…అది ప్రతి భారత పౌరుడు ప్రతిరోజూ ఆచరించాల్సిన బాధ్యత.
రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చినట్టే,వాటిని సమర్థంగా వినియోగించే బాధ్యతను కూడా అప్పగించింది.దేశ ప్రజలు రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని,దాని ఆత్మకు అనుగుణంగా జీవించినప్పుడే ఆ దేశం నిజమైన అర్థంలో బలంగా మారుతుందని.” అన్నారు
నేటి విద్యార్థులే రేపటి నాయకులు. క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశ సేవ భావన మీలో పెరిగినప్పుడే మీరు నిజమైన భారత పౌరులవుతారు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడమే” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో దేశభక్తి, రాజ్యాంగ విలువలు,సామాజిక బాధ్యతలను మరింతగా పెంపొందించాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.







