Hot Posts

6/recent/ticker-posts






 వాకలపూడి లో ఘనంగా నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ 36వ వార్షికోత్సవం

కాకినాడ జిల్లా కాకినాడ  రూరల్ మండలం వాకలపూడి ZPPH స్కూల్ లో  ప్రధాన ఉపాధ్యాయులు, మరియు విద్యాకమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 36 వ  వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిదులుగా ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు వారికి ఉన్నత పాఠశాల సిబ్బంది విద్య కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు ముందుగా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు 

ఎమ్మెల్యే  నానాజీ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కృషి పట్టుదలతో అన్ని రంగాలలో ప్రతిభ కనబరచాలని విద్యార్థులు మంచి మార్గాన్ని చేపట్టి గురువులకు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా తమ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు విద్యాబుద్ధులు అలపరుస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు వివిధ విద్యా, సాంస్కృతిక, విభాగల్లో    ప్రతిభ కనపరచిన విద్యార్థిని విద్యార్థులకు మరియు క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే  పంతం నానాజీ ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది విద్యా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పంతం నానాజీ నీ ఘనంగా సన్మానించారు...ఈ కార్యక్రమం లో స్థానిక కూటమి నాయకులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, విద్యార్థులు, తల్లి తండ్రులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు