Hot Posts

6/recent/ticker-posts



 జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు వాటర్ కూలింగ్ మిషన్లు ఏర్పాటు చేసిన ఎస్వీఎస్ అప్పలరాజు

ఎస్వీఎస్ సుధీర్ బాబు జ్ఞాపకార్ధంగా ఏర్పాటు చేసిన నాలుగు వాటర్ కూలింగ్ మిషన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


కాకినాడ జిల్లా జగ్గంపేట : రాష్ట్ర టిడిపి కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు తన కుమారుడు ఎస్వీఎస్ సుధీర్ బాబు జ్ఞాపకార్ధంగా జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 4 వాటర్ కూలింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. వీటిని మంగళవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. 

ఈసందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎస్వీఎస్ తనయుడు సుధీర్ బాబు దూరమై 8 సంవత్సరాల అవుతున్న ఆయన పేరిట ఏదో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న అప్పలరాజు ప్రతి సంవత్సరం జయంతి సందర్భంగా సుబ్రహ్మణ్య షష్టి లో పులిహోర దద్దోజనం మజ్జిగ పంపిణీ చేయడం అదేవిధంగా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించడం ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ వైభోగుల కొండబాబు యాదవ్, సాంబత్తుల చంద్రశేఖర్, కోడూరి రమేష్, బండారు నాని, కోండ్రోతు రమణ, సాంబత్తుల రాజేష్,డాక్టర్ ప్రణీత్ , డాక్టర్ నీలిమ, డాక్టర్ వర్మ , డాక్టర్ వినుషా , డాక్టర్ లక్ష్మీ , డాక్టర్ శ్రావణ సంధ్య, డాక్టర్ మాధురి,  తదితరులు పాల్గొన్నారు.