అస్సాగో కాలుష్యం పై జనవరి 31 లోపు ప్రభుత్వం స్పందించక పోతే మరోసారి "ఆమరణ నిరాహార దీక్ష" కు సిద్ధం -- జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివగణేష్
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామంలో నిర్మాణం చేసిన "అస్సాగో ఇథైల్ ఆల్కహాల్ కాలుష్యకారక పరిశ్రమ" వల్ల పరిసర గ్రామాల ప్రజలు వాయు కాలుష్యం, జల కాలుష్యం,శబ్ద కాలుష్యం మరియు బొగ్గు మండించడం వల్ల విడుదలయ్యే విపరీతమైన బూడిద వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తూ 2024 సంవత్సరం అక్టోబర్ 22 వ తేదీ నుండి2024, అక్టోబర్ 27 వ తేదీ వరకు సామూహిక "ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష" చెయ్యడం...గాంధేయ మార్గంలో శాంతియుత ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివ గణేష్,పాఠంశెట్టి సూర్య చంద్ర లకు మద్దతుగా అస్సాగో పరిశ్రమ వద్ద శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది అమాయక గ్రామీణ ప్రజలను పోలీస్ వారు అప్రజాస్వామికంగా,దౌర్జన్యంగా ఆడా,మగా తేడా లేకుండా విచక్షణా రహితంగా లాఠీ ఛార్జ్ చేసి బస్సులలో అర్థరాత్రి సమయంలో వేరు వేరు ప్రాంతాలకు,పోలీస్ స్టేషన్ లకు తరలించి పైశాచికత్వాన్ని ప్రదర్శించి అస్సాగో కాలుష్య బాధిత గ్రామీణ పౌరులను భయభ్రాంతులను చేశారు.అనంతరం అమాయక గ్రామీణ ప్రజలపై పోలీస్ కేసులు బనాయించారు.
అప్పటికి ఐదు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మరోతి శివ గణేష్, పాఠంశెట్టి సూర్య చంద్ర లను అప్రజాస్వామికంగా దీక్ష స్థలం గుమ్మల దొడ్డి రామాలయం నుండి రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
అమాయక గ్రామీణ ప్రజలపై జరిగిన ఈ అత్యంత దారుణమైన దాడి,లాఠీ ఛార్జ్,క్రిమినల్ కేసుల బనాయింపు మొత్తం వ్యవహారం స్థానిక జగ్గంపేట శాసన సభ్యులు జగ్గంపే నియోజకవర్గ ఎమ్మెల్యే అండదండలతో మాత్రమే జరిగింది.దానికి నిదర్శనం నేటికీ బాధిత ప్రాంతంలో పర్యటించడం గాని,బాధితులను పరామర్శించడం గానీ చెయ్యలేదు.కనీసం ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలుకు సైతం పోయిన పరిస్థిలేదు...ప్రజలు వారు అస్సాగో కాలుష్యం వల్ల అనుభవిస్తున్న పరిస్థితి ఎమ్మెల్యే కు మొర్రపెట్టు కొని ఎమ్మెల్యే ను నిలదీస్తారని జగ్గంపేట ఎమ్మెల్యే సంవత్సర కాలంగా గుమ్మళ్ళదొడ్డి, అచ్యుతాపురం, వెదురుపాక, బాబాజీ పేట ప్రాంత ప్రజలకు ముఖం చాటేస్తున్నారు.మరోతి శివ గణేష్ ను ఆయా గ్రామాల లో పర్యటించకుండా పోలీస్ ఆంక్షలు నేటికీ నడుస్తున్నాయి.పోలీస్ వారు రాజ్యాంగ విరుద్ధంగా 144 విధిస్తున్నారు.
నాటి జిల్లా కలెక్టర్ ఆయా గ్రామాల ప్రజలను నమ్మిస్తూ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి పది రోజుల్లో తేలుస్తామని చెప్పి, ఇప్పటికీ ఆ నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టు ప్రజలకు ఇచ్చింది గాని చెప్పింది గాని లేదు. నాటి కలెక్టర్ ట్రాన్స్ఫర్ మీద వెళ్లిపోవడం కూడా జరిగింది. ఒక నెల రోజుల్లో కాలుష్యం నియంత్రణ చేస్తామని చెప్పిన పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలు ప్రజలకు కనిపించకుండా పోయారు.
గోకవరం, కోరుకొండ మండలాల్లో సుమారు లక్షమంది ఆరోగ్యాలను ప్రభావితం చేసే " అస్సాగో ఇథైల్ ఆల్కహాల్ కాలుష్యకారక పరిశ్రమ" ను ప్రభుత్వం చొరవ తీసుకుని జనవరి 31 లోపు మూసి వేయుట (లేక)స్థాన చలనం చేయించక పోతే ఫిబ్రవరి 1 వ తేదీ నుండి ఆయా గ్రామాల యువకులతో కలసి మరో సారి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నానని జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివగణేష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
గమనిక:ప్రజా ప్రయోజన దృష్ట్యా, అమాయక గ్రామీణ ప్రజల ఆరోగ్యం పరిరక్షణ దృష్ట్యా... బావ సారూప్యత కలిగిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్చంద సేవా సంస్థల నాయకులు, ఇండిపెండెంట్ యువకులు అందరికీ ఈ చారిత్రాత్మకమైన ఈ "ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష" లో పాల్గొనే దానికి మరోతి శివ గణేష్ అనే నేను ఆహ్వానం పలుకుతున్నాను అని శివ గణేష్ తెలియజేశారు.
