Hot Posts

6/recent/ticker-posts




 జాతీయ ఓటర్ల దినోత్సవం

కాకినాడ జిల్లా జగ్గంపేట: 16 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శుక్రవారం ఎన్నికల అధికారులు నిర్వహించారు. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే ను పురస్కరించుకుని ఈ సి ఆదేశాల మేరకు తహసీల్దార్ జె వి ఆర్ రమేష్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో  కలిసి  ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ లో మానవహారం, జాతీయ ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. 

అనంతరం కళాశాల ఆవరణంలో తహసీల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు వజ్రాయుధం వంటిదని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎస్.పార్థసారథి, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.