ముఖ్య అతిథులుగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వి రవిరాజు, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక గోకవరం రోడ్డులోని కాపు సామాజిక భవనంలో వాకర్స్ హెల్త్ క్లబ్ జగ్గంపేట చాప్టర్ 152 ఏరియా 1 ఆధ్వర్యంలో జిల్లా 103 వాకర్స్ గవర్నర్ గా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం అధ్యక్షులు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు కాపు సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి తోలేటి సూర్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజు గవర్నర్ తోలేటి సూర్యనారాయణ తోను, క్యాబినెట్ మెంబర్స్ తోను ప్రమాణస్వీకారం చేయించారు. మరో ముఖ్యఅతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారం చేసిన తోలేటి సూర్యనారాయణ ను క్యాబినెట్ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ ప్రపంచంలో వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ 1650 క్లబ్ లతో 5లక్షల మంది సభ్యులతో ఆరోగ్యమే మహాభాగ్యం, నడు నడిపించు అనే నినాదంతో పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ నడవాలని నడక ఆరోగ్యానికి మంచిదని వాకర్స్ క్లబ్ స్థాపించడం జరిగిందని అనేక ఆరోగ్య శిబిరాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు కూడా చేస్తున్నామని, వాకర్స్ క్లబ్ లో సభ్యులందరికీ హెల్త్ కం ఐడి కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
గవర్నర్ తోలేటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జగ్గంపేట కు వాకర్స్ క్లబ్ కోసం స్థలం ఇమ్మని కోరుతూ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు వినతిపత్రం అందజేయ గా ఆయన వెంటనే స్పందించి జగ్గంపేట కోనేటి వద్ద వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్న పార్కు వద్దనే స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. తోలేటి సూర్యనారాయణ మాట్లాడుతూ నా ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చే సిన అతిరథ మహారధులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని మా వాకర్స్ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని మీరంతా ఆరోగ్యం కాపాడుకోవాలంటే వాకర్స్ క్లబ్ లో చేరాలని పిలు నిచ్చిరి. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ప్రతినిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమం తో ముందుండే మీరందరూ వాకర్స్ క్లబ్ లో ఉండడం ఎంతో సంతోషంగా ఉందని వాకర్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలు వెలకట్టలేవని తెలుగు నేల విశాఖపట్నంలో స్థాపించిన ఈ వాకర్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా క్లబ్బులు ఏర్పడడం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం అని మీకు ఏ అవసరం వచ్చినా ముందుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పి ఎస్ శర్మ, కోడూరి రంగారావు, రావి కృష్ణారావు, పి గోవింద గుప్తా, ఎం భాస్కరరావు, కోనేటి రవిరాజు, ముని కృష్ణ యాదవ్, డాక్టర్ నాగేంద్ర , తాతారావు , మల్లేశ్వరరావు, వెత్సానాగ సత్య ,పూర్రే సూరన్న ,ఇళ్ళబుద్దాజీ,డి సత్యనారాయణ మూర్తి ,సమ్మెట సాయిరాం , జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, కొత్త కొండబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, రాయి సాయి పొట్టి రాజేష్ ,మానేపల్లి సతీష్ కొత్త నాగ పండు ,తదితరులు పాల్గొన్నారు.


