సాగునీటి కోసం రైతన్నల ఎదురుచూపులు
కనికరించని కూటమి ప్రభుత్వం
పాటంశెట్టి సూర్యచంద్ర సామాజిక ఉద్యమకారుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న..
ఏరు దాటాక బోడి మల్లన్న...అన్న చందంగా
కాకినాడ జిల్లా: జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతులను శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మోసం చేశారని, నేడు పుష్కర ఆయకట్టు రైతులు అగమ్య గోచరంగా అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎన్ని కల ముందు ఓటేసి గెలిపించండి గెలిచిన వెంటనే పుష్కర తాళ్లూరు లిఫ్ట్, పైపులైను పూర్తిగా మార్చి సాగునీరు అందిస్తానని వాగ్దానాలు చేసి గద్దెనెక్కేక ఈ ఒక్క పంటకు విరామం ఇవ్వండి నిధులు తెస్తాను, పనులు చేయిస్తాను వచ్చే పంటకు పూర్తిస్థాయిలో నేను నీరిస్తాను అని నమ్మబలికిన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పుష్కర రైతులను మోసం చేశారని సూర్యచంద్ర ఆరోపించారు.
గత సంవత్సరంలో ఈ ఒక్క పంటకి ఆగండి వచ్చే పంటకు తప్పనిసరిగా నీరిస్తాను అన్న ఎం ఎ ల్ ఏ జ్యోతుల నెహ్రూ మాటలు నమ్మి గత నెల రోజుల నుండే పుష్కర ఆయకట్టుకి సంబంధించిన అన్ని గ్రామాలలో రైతులు పంటలకు పెట్టుబడి పెడుతున్నారని వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారని పుష్కర నీరు రాకపోవడం వల్ల వేసిన పంటలు, నారుమడులు ఎండిపోయి రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
సాగునీరు ఇవ్వలేనప్పుడు పంటకాలాని కంటే ముందుగానే బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా సంబంధిత అధికారులతో కలిసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించ వలసిన అవసరం ఉందని అలా చేయకుండా ఇదిగో గ్రాంట్ తెస్తున్నాను, అదిగో గ్రాంట్ తెస్తున్నాను అని 14 నెలల నుండి కాలయాపన చేస్తూ రైతులను మోసం చేసి రైతన్నలను నట్టేట ముంచారని పాటంశెట్టి సూర్యచంద్ర ఆక్షేపించారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి కనీసం రెండు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి పాడైన పైప్లైన్లు, మోటార్లు రిపేర్లు చేయించి ఈ సంవత్సరం పంట గట్టెక్కించాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు.
సాగునీరు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రైతులకు నీరు ఇవ్వకుండా అన్యాయం చేస్తే రైతులు పక్షాన అండగా నిలబడి రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాడుతామని సూర్యచంద్ర స్పష్టం చేశారు

