Hot Posts

6/recent/ticker-posts

జగన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ లో జైలు తప్పదు అంటున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


 జగన్ రెడ్డికి 3,500 కోట్ల రూ లిక్కర్ స్కేమ్ లో జైలు తప్పదు... ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ మిధున్ రెడ్డి షిట్ అధికారులు విచారించి అరెస్టు చేయటంతో జగన్ మేము ఏ తప్పు చేయలేదు అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే గులికింతపూస మాట్లాడినట్టుగా ఉందని నీ నేతృత్వంలోనే ఈ 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ముఖ్యంగా మీ ఎం పీ విజయ సాయి రెడ్డి మీలో మీ వాటాలు తేలక బయటపడ్డారని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్ లో ముఖ్య పాత్ర వహించగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కనుసన్న న లోనే జరిగిందని తొందర లో జగన్ అరెస్టు తప్పదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ముఖ్యంగా 2019 నుండి 2024 ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానాసిరకం మద్యం అమ్మి అనేకమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, వికలాంగులుగా, కిడ్నీ బాధితులుగా, లివర్ వ్యాధి బాధితులుగా మిగిలిపోయారని దీనిపై కూడా జగన్ పై విచారణ జరపాలని ఎమ్మెల్యే నెహ్రూ తెలియజేశారు. ఈ స్కామ్ లో అప్పుడు క్యాబినెట్లో ఈమధ్యం పాలసీని ఆమోదించిన వారందరినీ విచారించాలని దీనికి చంద్రబాబుకి, ఏ సంబంధం లేదని సిట్ అధికారులు ఈ స్కామ్ ను విచారించి బాధ్యులందరినీ జైలుకు పంపిస్తారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ సమావేశంలో. ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, సత్తి సదాశివరెడ్డి, కుంచే తాతాజీ, పాఠం శెట్టి నాగేశ్వరరావు, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు.