_సంకష్టహర చతుర్థి పర్వదినం సందర్భంగా స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం దంపతులచే అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాధరావు శర్మ లక్ష్మీ గణపతి హోమాన్ని, శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
_ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ, సంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఏటా పాడి పంటలు బాగా పండాలని, అన్నదాతలు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, అన్ని రంగాల వారు, ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో
ప్రతి నెల లోక కళ్యాణార్థం లక్ష్మి గణపతి హోమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కంబాల శ్రీనివాసరావు గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, రామసేన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు._
