Hot Posts

6/recent/ticker-posts



 జగ్గంపేటలో ఘనంగాలయన్స్‌ క్లబ్స్ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్‌ జోన్స్‌ జయంతి వేడుకలు

నివాళులర్పించిన లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ చైర్మన్ కొత్త కొండబాబు

కాకినాడ జిల్లా జగ్గంపేట  : లయన్స్‌ క్లబ్స్ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్‌ జోన్స్‌ జయంతి వేడుకలను లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జగ్గంపేట లైన్స్ కంటి ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్‌ జోన్స్‌ విగ్రహానికి లైన్స్ క్లబ్స్ చైర్మన్ లయన్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసిన లైన్స్ డిస్టిక్ చైర్మన్ కొత్తకొండ బాబు మాట్లాడుతూ మెల్విన్‌ జోన్స్‌ లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసి

ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలలో 14 లక్షల సభ్యులు గల ఏకైక సంస్థ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ భారతదేశంలో 487 డిస్టిక్ సంస్థ ఉన్నాయనిమెల్విన్‌ జోన్స్‌ స్ఫూర్తి తో జగ్గంపేటలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లైన్స్ కంటి ఆసుపత్రి డాక్టర్ డయానా వేములపల్లి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.