Hot Posts

6/recent/ticker-posts


 నాలుగు నెలల పాపకి మందులు ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కంబాల

రోడ్డు ప్రమాదం లో గాయపడిన వ్యక్తికి కంబాల ఐదు వేలు రూపాయలు ఆర్ధిక సహాయం
మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయాలు అందిస్తున్న కంబాల

_తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన  పడాల మురళి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుకి తీవ్రమైన గాయామైంది. ఈ విషయాన్ని_ 

విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు కి తెలపగా_

_స్పందించిన అయన డ్రైవర్స్ కాలనీలో  పడాల మురళి ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించి, వైద్య ఖర్చులకు ఐదు వేలు రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. నెలల పాప మందులు కోసం కంబాల పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం గోకవరం గ్రామం యానాదులు పేటకీ చెందిన రావుల భవానీ అనే యువతికి నాలుగు నెలల పాపకి ఉంది. అయితే పాప గుండెల్లో రంద్రం పడింది. ఈ విషయాన్ని బుధవారం యానాదుల పేటకు విచ్చేసిన_విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు._తక్షణమే స్పందించిన ఆయన మందులు కొనుగోలు కోసం పది వేలు రూపాయలు ఆన్ లైన్ ద్వారా పాప కుటుంబ సభ్యులకు చెల్లించారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు_