వైభవంగా ఎమ్మెల్యే సతీమణి జ్యోతుల మణి పుట్టినరోజు వేడుక నిర్వహించిన భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి
కాకినాడ జిల్లా జగ్గంపేట శాసనసభ్యులు
టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి మా అన్నపూర్ణేశ్వరి దేవి గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న జ్యోతుల సతీమణి మణిమ్మ పుట్టినరోజు వేడుకలు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, టిడిపి యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ భారతీయ ధర్మ పరిషత్ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో ఇర్రిపాక గ్రామం చేరుకుని ముందుగా మణిమ్మ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవద్గీత పుస్తకం, వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి చిత్రపటం అందజేసి ఆశీస్సులు తీసుకున్నామని మాకు స్ఫూర్తిదాయకులు నన్ను సన్మార్గంలో నడిచే విధంగా సూచనలు ఇస్తున్న దంపతులు దగ్గర దీవెనలు అందు కొని రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు లో పాలుపంచుకొని ఎల్లవేళలా జ్యోతుల నెహ్రూ అనుచరుడుగా నెహ్రూ అడుగు చాడల్లో నడుస్తూ వారికి కి మంచి పేరు తీసుకొస్తానని అన్నారు.
. ఈ కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మిక సేవకులు పాల్గొన్నారు.
Andrapradesh kakinada
