Hot Posts

6/recent/ticker-posts

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ





 పల్లె పండుగ 3.0 ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

గాంధీ మహాత్మునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

 తూర్పుగోదావరి జిల్లా  గోకవరం :

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గాంధీ మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడంఎంతో గర్వంగా ఉందన్నారు.

 ఇందులో భాగంగా కొత్తపల్లి2 కోట్ల50 లక్షలు, కామరాజుపేట 3 కోట్ల 60 లక్షల తో, గ్రామాలలో పల్లె పండుగ సంస్కరణ ఉత్సవ సందడి - అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే,టిటిడి బోర్డు మెంబర్,టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు  జ్యోతుల నెహ్రూ.

 గోకవరం మండలం  కొత్తపల్లి,కామరాజుపేటలో జగ్గంపేట మార్కెట్  కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, జగ్గంపేట అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ జనపరెడ్డి బాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ 3.0 గ్రామ సంస్కరణల ఉత్సవ గ్రామసభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా, నియోజవర్గ అబ్జర్వర్ గా అల్లాడ స్వామి నాయుడు హాజరయ్యారు.

ముందుగా గ్రామసభలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వి బి జి రాంజీ నిధుల కింద కొత్తపల్లి గ్రామం నందు పదిహేను పనులకు సంబంధించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లు మరియు సిమెంట్ డ్రైన్ల నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభోత్సవం నిర్వహించారు. కామరాజుపేట గ్రామంలో కూడా గ్రామసభ నిర్వహించి గ్రామంలో మూడు కోట్ల 60 లక్షల రూపాయలతో 21 పనులు సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పల్లె పండుగ అనేది కేవలం పండుగ కాదు, పల్లెల రూపురేఖలను మార్చే గొప్ప సంస్కరణ అని, ఈ సంస్కరణ ఉత్సవంలో ఎనిమిది కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లో గ్యారంటీ పర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ అమలు, నూట ఇరవై ఐదు రోజుల ఉపాధి హామీ, గ్రామంలో పదిహేను రోజుల్లో ఉపాధి కల్పన, వేతనాల సకాలంలో చెల్లింపు, అనుమతించబడిన మూడు వందల డెబ్బై ఐదు రకాల పనులు, వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక, గ్రామ సభ ద్వారా పారదర్శకత, అభివృద్ధికి కేంద్రంగా గ్రామ పంచాయతీ అనే లక్ష్యాలతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గాంధీ జయంతి రోజున కొత్తపల్లిలో రెండు కోట్ల యాభై లక్షలతో, కామరాజుపేటలో మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో  రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని, కొత్తపల్లి, కామరాజుపేటతో సహా గోకవరం మండలంలోని ప్రతి గ్రామానికి రోడ్లు, డ్రైనేజీ కొరత లేకుండా చేసి మండలాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మండలంగా నిలబెడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, నియోజవర్గ నాయకులు, మండల నాయకులు,  మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.