Hot Posts

6/recent/ticker-posts

జగ్గంపేట టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి గా జీను మణిబాబు నామినేషన్





 జగ్గంపేట టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి గా జీను మణిబాబు నామినేషన్ - అట్టహాసంగా  కార్యక్రమం.. హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట  : జగ్గంపేట  జడ్పీటీసీ స్థానానికి కూటమి పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీను మణిబాబు నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది.

ముందుగా జగ్గంపేట గ్రామదేవత రావులమ్మ అమ్మవారికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ జన సందోహంతో కాకినాడ బయలుదేరి వెళ్లి జిల్లా పరిషత్ భవనంలో నామినేషన్ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై ఆశీస్సులు అందించి  శుభాకాంక్షలు తెలియజేశారు, జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ హాజరై మణిబాబుకి  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించిన జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జగ్గంపేట మండల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సేవలో ఉంటానని హామీ ఇచ్చారు.

 జడ్పిటిసి టిడిపి అభ్యర్థి జీను మణిబాబుని అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం మన ప్రాంత అభివృద్ధికి అన్ని విధాల సహకరించుకుందామని ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, అడబాల వెంకటేశ్వరరావు, అన్నవరం బోర్డు సభ్యులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, ఎస్ఏ గపూర్, రాయి సాయి, ఉప్పలపాటి బుల్లబ్బు, వేములకొండ జోగారావు   కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.