Hot Posts

6/recent/ticker-posts

జూడో వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ క్యాంపు ముగింపు


జూడో  వెయిట్ లిఫ్టింగ్  సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం 
ముఖ్యఅతిథి హాజరై విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


కాకినాడ జిల్లా జగ్గంపేట  డీ ఫిట్నెస్ జిమ్  దేవి సెంటర్ జగ్గంపేట నందు జూడో  వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి మే 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహించారు .జూడో  వెయిట్ లిఫ్టింగ్  సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం   కోచ్ వి వి రమణ  ఆధ్వర్యంలో  ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై  జూడో  వెయిట్ లిఫ్టింగ్  సమ్మర్ కోచింగ్ క్యాంప్ చేసిన పిల్లలకు జూడోలోనూ  వెయిట్ లిఫ్టింగ్ లోను  సర్టిఫికెట్స్  అందజేశారు. 

అనంతరం ఖమ్మం  కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, రజిత మెడల్ సాధించిన అనిల్, అభి, విక్రమ్ సాయి లకు, క్యాంపులో ఫస్ట్ సాధించిన కార్తీక్ కు, సెకండ్ సాధించిన   అమృతకు మెడల్స్  అందించిన  ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట డి జిమ్ ఫిట్నెస్     అధినేత టీవీ రమణ ఆధ్వర్యంలో వారి విద్యార్థులు జిల్లాస్థాయిలోను    రాష్ట్రస్థాయిలోనూ, జాతీయ స్థాయిలను ఎన్నో మెడల్స్ సాధిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నానని ఇదేవిధంగా మీ ఫిట్నెస్ పెంచుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే విద్యార్థినిదేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, నాండ్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.