Hot Posts

6/recent/ticker-posts

డొక్కపాలెం గణపతి నవరాత్రి మహోత్సవాలకు కంబాల రూ.10 వేల విరాళం.


 డొక్కపాలెం గణపతి నవరాత్రి మహోత్సవాలకు కంబాల రూ.10 వేల విరాళం.


పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, అడ్డతీగల మండలం డొక్కపాలెం గ్రామంలో నిర్వహించనున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు, అన్నసమారాధన కార్యక్రమానికి_

విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు  _

రూ.10 వేల విరాళాన్ని  గోకవరం–తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆన్లైన్ ద్వారా ఉత్సవాల నిర్వాహకులకు అందజేశారు.

ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని, సూచించారు._

కంబాల శ్రీనివాసరావు  అందించిన విరాళానికి డొక్కపాలెం గ్రామ గణపతి ఉత్సవాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు._

ఆయన అందిస్తున్న సహాయ సహకారాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు.